Tollywod: బుర్రపాడే.. ఈ అమ్మాయి ఏంటి గురూ ఇంత హాట్‌గా మారిపోయింది..

కొన్ని రోజులు నుంచి సోషల్ మీడియాలో ఈ అమ్మాయి ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. ఆ అమ్మాయి లేటెస్ట్ ఫోటోలు చూస్తే మీరు కూడా స్టన్ అవుతారు. హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తే పక్కాగా బ్రేక్ ఇస్తాం అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఈ అమ్మాయికి ఇన్ స్టా 43 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు.

Tollywod: బుర్రపాడే.. ఈ అమ్మాయి ఏంటి గురూ ఇంత హాట్‌గా మారిపోయింది..
Shriya Kontham

Updated on: Jan 25, 2025 | 1:18 PM

ఇండస్ట్రీలో కొందమంది నటీమణులు.. అలా ఒక మెరుపు మెరిసి ఇలా మాయమై పోతుంటారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం వారి అందాల రచ్చ మాములుగా ఉండదు. మెస్మరైజ్ చేేసే ఫోటోలతో నెటిజన్స్ అటెన్షన్ గ్రాబ్ చేస్తూ ఉంటారు. తాజాగా ఒక అమ్మాయి ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఈ అమ్మాయి ఏంటి ఇలా మారిపోయింది.. నమ్మలేకపోతున్నాం అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఆమె హీరోయిన్ మెటీరియల్ అని.. ఆ పాత్రలు ట్రై చేస్తే బ్రేక్ ఇస్తాం అని మరికొంతమంది అంటున్నారు. ఇంతకీ పై ఫొటోలో ఉన్న అమ్మాయి ఇప్పుడెలా ఉందో మీరు చూశారా..?

నేచురల్ స్టార్ నాని హీరోగా విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో ‘గ్యాంగ్ లీడర్’ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో నానితో పాటు మొత్తం ఐదు జనరేషన్స్‌కి సంబంధించిన మహిళలు కీ రోల్స్ పోషించారు. వారిలో టీనేజ్ అమ్మాయిగా నానికి సోదరి లాంటి రోల్‌లో మెరిసిన అమ్మాయి అందరికి గుర్తుకు ఉండే ఉంటుంది. సినిమాలో కళ్ళజోడు పెట్టుకొని పక్కింటి అమ్మాయిలా అనిపిస్తుంది. తన పేరు శ్రియ కొంతం. గ్యాంగ్ లీడర్  తరువాత మరో సినిమాలో శ్రియ యాక్ట్ చేయలేదు.

సోషల్ మీడియాలో ఈమె సూపర్ యాక్టివ్. వావ్ అనిపించేలా ఫోటోషూట్స్ చేస్తూ, ఆ ఫోటోలను షేర్ చేస్తూ ఫాలోవర్స్‌ని పెంచుకుంటూ వస్తుంది. ఇక హీరోయిన్‌‌గా ఆమె ఎంట్రీ ఇవ్వబోతుందా అన్న విషయంపై క్లారిటీ లేదు. ప్రస్తుతం ఈ అమ్మడి కొన్ని పిక్స్ మాత్రం నెట్టింట వైరల్‌గా మారాయి. వాటిపై మీరూ ఓ లుక్కేయండి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.