
ప్రణీత సుభాష్.. తెలుగులో తిరుగులేని హీరోయిన్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ ఉహించని విధంగా పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అయ్యింది ఈ అమ్మడు. ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ చిన్నది.

ఆ మధ్యన హిందీలోనూ కొన్ని సినిమాలు చేసింది. అయితే తెలుగులోనే ఈ ముద్దుగుమ్మ బాగా ఫేమస్. సిద్ధార్థ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, పవన్ కల్యాణ్, రామ్, మంచు మనోజ్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో యాక్ట్ చేసింది అందాల తార.

అందం, అభినయం పరంగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే చాలా సినిమాల్లో సెకెండ్ హీరోయిన్ గానే నటించిందీ సొగసరి. అందుకే స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయింది. అందుకే సినిమా కెరీర్ ఉండగానే పెళ్లి చేసుకుని అభిమానులకు షాక్ ఇచ్చింది.

అంతే కాదు వెంట వెంటనే ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ సోషల్ మీడియాలో మాత్రమే యాక్టివ్ గా ఉంటోంది. ఎప్పటికప్పుడు తన ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది. తల్లి అయినా కూడా తన అందంతో ప్రేక్షకులను కవ్విస్తుంది.

తాజాగా ప్రణీత సుభాష్ కొన్ని ఫోటోలను పంచుకుంది. మంచులో విహరిస్తూ కొన్ని అందమైన ఆ ఫోటోలను పంచుకుంది. ఈ ఫోటోల పై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఈ అందమైన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. త్వరలోనే ప్రణీత సుభాష్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టనుందని టాక్.