Ananya Nagalla: అతనిని బాగా నమ్మి మోసపోయా.. మూడేళ్లపాటు నరకం చూశా.. బ్రేకప్ స్టోరీ చెప్పిన అనన్య నాగళ్ల

టాలీవుడ్ లో హీరోయిన్ గా రాణిస్తున్న తెలుగు అమ్మాయిల్లో అనన్య నాగళ్ల ఒకరు. ఖమ్మం జిల్లాకు చెందిన ఈ ముద్దుగుమ్మ వరుసగా సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. ఆ మధ్యన ఇన్ స్టా గ్రామ్ సబ్ స్క్రిప్షన్ తో వార్తల్లో నిలిచన అనన్యకు ఓ బ్రేకప్ స్టోరీ కూడా ఉందట.

Ananya Nagalla: అతనిని బాగా నమ్మి మోసపోయా.. మూడేళ్లపాటు నరకం చూశా.. బ్రేకప్ స్టోరీ చెప్పిన అనన్య నాగళ్ల
Ananya Nagalla

Updated on: May 20, 2026 | 3:16 PM

ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన అనన్య నాగళ్ల సినిమాల్లోక రాక ముందు ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా కొన్నాళ్లు వర్క్ చేసింది. అయితే నటనపై ఆసక్తితో మొదట షార్ట్ ఫిల్మ్స్ చేసింది. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. మల్లేశం సినిమాతో వెండితెరకు పరిచయమైన అనన్య నాగళ్ల అతి కొద్ది కాలంలోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్లే బ్యాక్, వకీల్ సాబ్, మ్యాస్ట్రో, ఊర్వశివో రాక్షసివో, శాకుంతలం, మళ్లీపెళ్లి, అన్వేషి, తంత్ర, డార్లింగ్, పొట్టేల్, శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ తదితర సినిమాలలో అనన్య నటించింది. ఓవైపు హీరోయిన్ గా మెప్పిస్తూనే మరోవైపు సహాయక నటిగానూ ఆకట్టుకుందీ అందాల తార. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంటోన్న అనన్య రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూకు హాజరైంది. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను అందులో షేర్ చేసుకుంది. ఇదే సందర్భంగా తన బ్రేకప్ స్టోరీని కూడా చెప్పి బాధపడింది.

ఇటీవలి కాలంలో దేని గురించైనా ఏడ్చావా? ఎందుకు ఏడ్చావని అని యాంకర్ ప్రశ్నించగా అనన్య ఇలా సమాధానమిచ్చింది. ‘ చాలా ఏళ్ల తర్వాత బాగా ఏడ్చాను. అది కూడా ఒక వ్యక్తి వల్ల. ఇది లవ్ బ్రేకప్, లవ్ ఫెయిల్యూర్ అని నేను చెప్పను. కానీ ఒక వ్యక్తిని బాగా నమ్మాను. కానీ మోసపోయాను. ఉదయాన్నే నిద్రలేవగానే ఆ ఆలోచనలే వెంటాడతాయి. ఎంత బిజీగానే ఉన్నా అవే గుర్తొస్తూనే ఉంటాయి. బ్రేకప్ తాలూకా బాధను మూడేళ్లపాటు అనుభవించా. అయితే షూటింగ్స్‌కి మాత్రం అస్సలు మిస్ అయ్యే దానిని కాదు. రాత్రంతా ఏడ్చినా తెల్లవారగానే జిమ్‌కి వెళ్లిపోయాదాన్ని. షూటింగ్‌లో కేరవాన్‌లోనే కూర్చొని నా షాట్ వచ్చే వరకు వెక్కి వెక్కి ఏడ్చేదానిని. తర్వాత కళ్లు తుడుచుకుని నా పని చూసుకునేదానిని. నాకు తెలిసి చాలా మంది అమ్మాయిలకు ఇవే ప్రాబ్లమ్స్ ఉంటాయి. అమ్మాయిలు చాలా సెన్సిటివ్. అమ్మాయిలు వదిలేసి వెళ్లిపోతారని చాలా మీమ్స్ సోషల్ మీడియాలో వస్తుంటాయి.  ఎన్నో మాటలు అంటారు. అబ్బాయిలు ఎక్కువగా ఉండటం, కంటెంట్ క్రియేటర్స్ కూడా వాళ్లే ఉండటం వల్ల వాళ్ల పాయింట్ ఆఫ్ వ్యూ బయటకు వస్తుంది. మన పాయింట్ ఆఫ్ వ్యూ బయటకు రావడం లేదు’ అని అనన్య ఎమోషనలైంది.  ప్రస్తుతం ఈ తెలుగమ్మాయి కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

తల్లితో అనన్య నాగళ్ల..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us