అలాంటి మనిషిని ఎక్కడా చూడలేదు.. ఆయన గొప్పతనం చనిపోయాకే అర్ధమైంది..

విలన్ గా, కామెడీ విలన్ గా, హీరోగా, సహాయక నటుడిగా ఎన్నో విభిన్నమైన పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించాడు నటుడు. ఇక ఇప్పుడు శివాజీ రాజా హీరో, హీరోయిన్స్ కు తండ్రిగా నటిస్తూ మెప్పిస్తున్నారు. అలాగే పలు ఇంటర్వ్యూలో పాల్గొంటున్నారు ఆయన..

అలాంటి మనిషిని ఎక్కడా చూడలేదు.. ఆయన గొప్పతనం చనిపోయాకే అర్ధమైంది..
Shivaji Raja

Updated on: May 28, 2026 | 12:43 PM

ప్రముఖ నటుడు శివాజీ రాజాప్రస్తుతం సినిమాలు తగ్గించారు. అడపదడపా కొన్ని సినిమాల్లో సహాయకపాత్రలో నటిస్తూ మెప్పిస్తున్నారు. విలక్షణ నటుడిగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు శివాజీరాజా. విలన్ గా, సహాయక పాత్రలతో పాటు హీరోగానూ సినిమాలు చేశారు శివాజీ రాజా. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో దివంగత సినీ దిగ్గజం దాసరి నారాయణరావు గారి అపారమైన సేవలను, వ్యక్తిత్వాన్ని పంచుకున్నారు. దాసరి నారాయణరావు గారు కేవలం ఒక దర్శకుడు లేదా నిర్మాత మాత్రమే కాదని, తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక ఆశాజ్యోతి అని ఆయన అన్నారు. దాసరి గారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా), దర్శకుల మండలి, నిర్మాతల మండలి, ఛానెల్ ఫెడరేషన్ వంటి వివిధ సినీ సంఘాల ఎన్నికలలో, కార్యకలాపాలలో చురుకైన పాత్ర పోషించేవారని శివాజీ రాజా గుర్తు చేసుకున్నారు. శివాజీ రాజా ఒక సందర్భంలో దాసరి నారాయణరావు గారిని ఎందుకు మీరు అన్ని విషయాల్లో జోక్యం చేసుకుంటారు.. అలాగే ప్రజలు బయట మిమ్మల్ని ఎంతగానో గౌరవించినప్పటికీ, లోపల విమర్శలు చేస్తున్నారని అన్నారట… దీనికి దాసరి నారాయణరావు గారు ఇచ్చిన సమాధానం ఇస్తూ..” మనం ఉన్నాము, ఏదో చేస్తున్నాము అనుకొని కొంచెం పర్యవేక్షిస్తున్నాము అనే భయం ఉంది కాబట్టి ఇంకా అంతో ఇంతో జరుగుతోంది. లేకపోతే ఇది కూడా జరగదు. ఎంతోమంది ఇబ్బంది పడిపోతారు” అని దాసరి గారు అన్నారు. అందరికీ న్యాయం చేయలేమని, తాను చేసేదంతా న్యాయమని కూడా నమ్మనని, కానీ తన ఉనికికి కొంతవరకు కాపాడుతుందని, ఆ భయం ఉండాలని ఆయన స్పష్టం చేశారట.

ఇది కూడా చదవండి : అప్పట్లో కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్.. అండర్ వరల్డ్ మాఫియా దెబ్బకు రాత్రికి రాత్రే మాయం..

పదవులు, లాభాల కోసం కాదని, చేయాల్సినంత చేశానని, కానీ పరిశ్రమలో తన కొనసాగింపు అవసరమని ఆయన  చెప్పారట. దాసరి గారి ఈ సిద్ధాంతాన్ని శివాజీ రాజా తన జీవితానికి, మా అసోసియేషన్ అధ్యక్షుడిగా తన పాత్రకు అన్వయించుకున్నారు. శివాజీ రాజా మాట్లాడుతూ.. “వెయ్యి మంది ఆర్టిస్ట్ లలో ఒక 400 మందికి ఫుడ్ ఉండదు” అని చెబుతూ, అలాంటి వారికి తాను కుటుంబ సభ్యుడిగా అండగా ఉంటానని వివరించారు. చిరంజీవి గారి నుంచి తన వరకు ఏడెనిమిది మంది అధ్యక్షులు ఉన్నా, కళాకారులు తన వద్దకు అంత సౌకర్యంగా రావడానికి కారణం, వారు తనను కేవలం అధ్యక్షుడుగానే కాకుండా, తమ కుటుంబ సభ్యుడిగా చూడడమేనని శివాజీ రాజా పేర్కొన్నారు. ఆర్థికంగా బలంగా లేని, పెద్ద హీరోగా గుర్తింపు లేని తాను, రాజకీయాలు, అడ్డంకులను దాటుకుని మా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికవ్వడం తనపై ఉన్న నమ్మకానికి నిదర్శనమని ఆయన గర్వంగా చెప్పారు.

ఇది కూడా చదవండి : Jabardasth: జబర్దస్త్‌లో అతను చాలా కమర్షియల్.. భోజనానికి రమ్మని పిలిస్తే పెట్రోల్‌కు డబ్బులు అడుగుతాడు..

దాసరి నారాయణరావు గారి గొప్పతనం ఆయన మరణానంతరమే నిజంగా అర్థమైందని శివాజీ రాజా తెలిపారు. ఆయన కుమారుడు పెద్ద హీరో కాకపోయినా, ఆయన వారసులుగా చెప్పుకోదగినవారు లేకపోయినా, ఆయన చనిపోయిన తర్వాత విగ్రహం పెట్టడం ఆయన ప్రభావానికి నిదర్శనమన్నారు. సినీ పరిశ్రమలో రామారావు గారి ఇంటి ముందు కనిపించే కార్ల మాదిరిగానే దాసరి గారి ఇంటి ముందు కూడా కార్లు ఉండేవని గుర్తు చేసుకున్నారు. దాసరి నారాయణరావు గారు చివరి రోజులలో కిమ్స్ ఆసుపత్రిలో ఉన్నప్పుడు, శివాజీ రాజా ప్రతిరోజూ ఆయన్ను చూడటానికి వెళ్లేవారట. ఒకసారి దాసరి గారు శివాజీ రాజా చేతులు పట్టుకుని, “ఇంత మంచివాడిని ఇన్నాళ్లు ఎలా వదిలేసుకున్నానురా నేను” అని అన్నారని, అది తన జీవితంలో మర్చిపోలేని సంఘటన అని శివాజీ రాజా ఎమోషనల్ అయ్యారు. అలాంటి గొప్ప వ్యక్తిత్వం దాసరి గారిదని శివాజీ రాజా  చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఆ ఇద్దరు హీరోలతో సినిమాలు చేయాలనుంది.. ఎప్పుడు ఛాన్స్ వస్తుందో చూడాలి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us