
తెలుగు సినీ పరిశ్రమలో తన సుదీర్ఘ అనుభవాలను సీనియర్ నటుడు మురళీ మోహన్ ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఇండస్ట్రీలో స్వేచ్ఛాయుత వాతావరణం ప్రేమలో పడటానికి సులభతరం చేస్తుందని, చుట్టూ అందమైన హీరోయిన్లు ఉంటారని ఆయన పేర్కొన్నారు. నటీమణులతో తన అనుభవాలను వివరిస్తూ..అప్పటి హీరోయిన్స్ లో అతిలోక సుందరి శ్రీదేవిని అత్యంత గ్లామరస్‌గా అభివర్ణించారు. ఆమె అందం, కళ్ళు, అభినయం, అలాగే తనతో సమానమైన ఎత్తును ప్రస్తావించారు. ఆమె చాలా అందంగా ఉండేవారని మురళి మోహన్ అన్నారు. అలాగే శ్రీదేవి తర్వాత అంత అందమైన హీరోయిన్ ఎవరు అంటే నటి దీప పేరు చెప్పారు మురళి మోహన్.
నటి దీప గురించి మాట్లాడుతూ,.. శ్రీదేవి తర్వాత దీప చాలా అందంగా ఉండే వారు. ఆమె చిన్న వయస్సులోనే పరిశ్రమలోకి వచ్చారని, అద్భుతమైన అందం తో ఆకట్టుకున్నారు దీప. అయితే, ఆమె ఆరోగ్య పరిస్థితులు, తల్లి పర్యవేక్షణ, అలాగే ఆ తర్వాత ఆమె శరీరంలో వచ్చిన మార్పుల గురించి ప్రస్తావించారు. దీప షూటింగ్ కు వచ్చినప్పుడు ఎప్పుడూ పక్కన ఆమె తల్లి కూడా ఉండేవారు. దీప 16ఏళ్ల వయసులోనే హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి వచ్చారు. ఎప్పుడు చూసిన పక్కన ఆమె తల్లి ఉండేవారు.
షాట్ అయిపోగానే దీపకు చాక్లెట్లు, బిస్కెట్లు లాంటి చిరుతిండ్లు ఎక్కువగా పెట్టేది. దీపకు ఎప్పుడూ ఎదో ఒకటి తినిపిస్తూ ఉంటది ఆమె తల్లి అడిగితే చిన్న పిల్ల కాదండి అనేది.. దాంతో ఆమె రాను రాను బరువు పెరిగి బొద్దుగా మారిపోయింది. కొద్దిరోజుల్లోనే భారీగా శరీరం పెరిగిపోయింది. అలాగే అప్పట్లో త్వరగా హీరోయిన్ ను చేయాలనీ స్టెరాయిడ్స్ వాడారు అని టాక్ కూడా ఉంది అని మురళి మోహన్ అన్నారు. అలాగే జయసుధను “ఫ్యామిలీ లేడీ”గా, అత్యంత సహజ నటిగా పేర్కొన్నారు. “సినిమా యాక్టర్” లాగా కాకుండా, నిజ జీవితంలో ఒక పాత్రను నటిస్తున్న ఫీలింగ్ ఆమెతో ఉంటుందని, ఎంతో సహకార స్వభావం కలదని మురళీ మోహన్ వివరించారు. ఆమె సింపుల్ మేకప్‌తో, నేత చీరలతో సహజంగా కనిపించేవారని తెలిపారు. జయసుధను తన సోదరిగా భావిస్తానని, అందుకే ఆమెతో ఎక్కువ సన్నిహితంగా ఉంటానని తెలిపారు మురళి మోహన్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి