రాష్ట్రంలో మహిళల భద్రతకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు ఏపీ సీఎం జగన్. ఇందులో భాగంగానే దిశ మొబైల్ యాప్‌ను రూపొందించారు. ఈ యాప్ పనితీరు, ఉద్దేశం నచ్చి చాలామంది ప్రముఖులు దిశపై అవగాహన కల్పిస్తున్నారు. దిశ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం, ఆపద సమయంలో ఉపయోగించడం ఎలా అనే విషయంపై ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కల్పించారు. విద్యార్థినులు, యువతులు, మహిళలు ఈ అవగాహన సదస్సులో పాల్గొన్నారు. తాజాగా విశాఖలో దిశ యాప్ పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో సినీ హీరో అడవి శేషు పాల్గొన్నారు. బీచ్ రోడ్‌లో పోలీసులతో కలిసి అవగాహన కల్పించారు.
మహిళల భద్రత కోసం వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని అడవి శేషు కొనియాడారు. రాఖీ పండగ రోజున దిశ పై అవగాహన కల్పించడం ఆనందంగా ఉందన్నారు. దిశ యాప్ ఉంటే అన్నలాంటి రక్షణ మీతోడు ఉన్నట్టేనని అన్నారు. యాప్ తో పోలీసులకు సమాచారం అందిన వెంటనే స్పందిస్తున్నారని అడవి శేషు వివరించారు. దిశ యాప్ ఆవశ్యతను మహిళలకు వివరించారు. రాష్ట్రంలో స్మార్ట్ ఫోన్ ఉండే ప్రతి మహిళ వద్ద దిశ యాప్ ఉండాలని సీఎం జగన్ గతంలోనే ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళల రక్షణ కోసం 18 దిశ పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు చేసి, దిశ చట్టాన్ని అమలు చేస్తున్నామని సీఎం వైఎస్ జగన్ చాలాసార్లు చెప్పారు.
‘మేజర్’గా అడవి శేష్
కాగా క్షణం, గూఢచారి చిత్రాలతో విలక్షణ నటుడిగా పేరుతెచ్చుకున్న అడివి శేష్ ప్రస్తుతం ‘మేజర్’ చిత్రంలో నటిస్తున్నారు. 26/11 ముంబై తీవ్రవాద దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ మూవీని సూపర్ స్టార్ మహేశ్ బాబు నిర్మిస్తుండటం విశేషం. సోనీ పిక్చర్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్స్ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నాయి. ఈ చిత్రంపై ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. గతంలో రిలీజ్ డేట్ ప్రకటించినప్పటికీ.. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా విడుదల కాలేదు.
Also Read: మాస్క్ తీస్తే ఒక భయం.. పెట్టుకుంటే మరొక భయం.!.. డెంటిస్టుల వద్దకు బాధితుల క్యూ
తెలుగు రాష్ట్రాల్లో డెత్ మిస్టరీలు.. విజయవాడలో చార్టెడ్ అకౌంటెంట్ సింధు మరణం వెనుక బోలెడు ప్రశ్నలు