
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఎన్నో చిత్రాలు రికార్డులు సృష్టించాయి. దాదాపు ఏడాది క్రితం విడుదలైన ఒక అందమైన ప్రేమకథ సంచలనం క్రియేట్ చేసింది. 2025 జూలై 18న విడుదలైన ఈ మూవీ అభిమానుల హృదయాలను గెలుచుకుంది. ఈ సినిమా మొదటి వార్షికోత్సవం సందర్భంగా, చిత్ర నిర్మాతలు ఈ ఇద్దరు తారల రొమాంటిక్, కొన్ని అరుదైన ఫోటోలను పంచుకున్నారు. సోషల్ మీడియాలో కనిపించిన వెంటనే ఈ ఫోటోలు పాత మధుర జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చాయి. ఆ సినిమా పేరు సయ్యారా.. బాలీవుడ్ కొత్త నటీనటులు అహన్ పాండే, అనిత్ పడ్డా జంటగా నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అప్పట్లో ఈ మూవీ థియేటర్లలో కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ సినిమాలో అహన్, అనిత్ ఇద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతేకాదు ఈ సినిమా క్లైమాక్స్ చూసి యూత్ అంతా ఎమోషనల్ అయ్యారు.
మోహిత్ సూరి దర్శకత్వంలో, యష్ రాజ్ ఫిల్మ్స్ సీఈఓ అక్షయ్ విధాని నిర్మించిన ‘సయ్యారా’ భారతీయ సినిమా చరిత్రలోనే అతిపెద్ద ప్రేమకథలలో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించి రూ.580 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ చిత్రం అనిత్, అహాన్‌లను రాత్రికి రాత్రే స్టార్లుగా మార్చేసింది.
ఈ సినిమా విడుదలై సంవత్సరం పూర్తైనందున మేకర్స్ తమ సోషల్ మీడియా ఖాతాలలో “సయారాకు మీ హృదయాల్లో స్థానం కల్పించినందుకు మీకు చాలా ధన్యవాదాలు… ఇది మాకు ఎంతో విలువైనది.” “మా సంగీతాన్ని, మా మధురమైన కథను , మా సంభాషణలను ఎంతగానో ప్రేమించిన సయారా అభిమానులందరి కోసం, మీరు ఇప్పుడు కొన్ని ప్రత్యేకమైన జ్ఞాపకాలతో కూడిన 2-డిస్క్‌ల ప్రత్యేక కలెక్టర్స్ ఎడిషన్ LPని పొందవచ్చు.” అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో అందుబాటులో ఉంది.