Tollywood: ఈ పిల్లాడిని గుర్తు పట్టారా? ఒకప్పుడు యాంకర్.. ఇప్పుడు స్టార్ హీరో.. కరాటేలో బ్లాక్ బెల్ట్ కూడా..

తండ్రి జైలు సూపరింటెండెంట్.. అక్కేమో డాక్టర్.. ఇతను కూడా కంప్యూటర్ సైన్స్ ఇంజినీరంగ్, ఎంబీఏ లాంటి పెద్ద చదువులే చదివాడు. కానీ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఒకప్పుడు టీవీ యాంకర్ గా బుల్లితెరపై, సైడ్ యాక్టర్ గా వెండితెరపై కనిపించి ఇప్పుడు స్టార్ హీరో రేంజ్ కు ఎదిగాడు.

Tollywood: ఈ పిల్లాడిని గుర్తు పట్టారా? ఒకప్పుడు యాంకర్.. ఇప్పుడు స్టార్ హీరో.. కరాటేలో బ్లాక్ బెల్ట్ కూడా..
Sivakarthikeyan

Updated on: Aug 26, 2025 | 7:47 PM

పై ఫొటోలోని సర్కిల్ లో ఉన్న పిల్లాడిని గుర్తు పట్టారా? ఇతను ఇప్పుడు స్టార్ హీరో. సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి గాడ్ ఫాదర్ అండ లేకుండా స్వయం కృషితో స్టార్ హీరోగా ఎదిగిన వాళ్లలో ఈ నటుడు ఒకడు. అందుకే ఈ హీరోకు కోట్లాది మంది అభిమానులున్నారు. ఒక సాధారణ కుటుంబంలోనే ఈ హీరో కూడ పుట్టాడు. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ లో డిగ్రీ పట్టా అందుకున్నాడు. ఎంబీఏ కూడా పూర్తి చేశాడు. అయితే సాఫ్ట్ వేర్ లాంటి ఉద్యోగాలకు వెళ్లకుండా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. మొదట చిన్న చిన్న షోలకు యాంకర్ గా వ్యవహరించాడు. కొన్ని షార్ట్ ఫిల్మ్స్ లోనూ నటించాడు. అలాగే ధనుష్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో సైడ్ రోల్స్ కూడా చేశాడు. తనదైన నటనతో ప్రేక్షకులను అలరించాడు. ఆ తర్వాత సోలో హీరోగా ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఇప్పుడు స్టార్ హీరో రేంజ్ కు ఎదిగిపోయాడు. గత కొన్నేళ్లుగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటోన్న ఈ హీరోతో సినిమాలు చేసేందుకు స్టార్ డైరెక్టర్లు క్యూ కడుతున్నారు. ఇంతకీ ఈ హీరో ఎవరో గుర్తు పట్టారా? తను మరెవరో కాదు అమరన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన శివ కార్తికేయన్.

మహావీరుడు, అలయాన్, అమరన్.. ఇలా హ్యాట్రిక్ హిట్స్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు శివ కార్తికేయన్. ఇప్పుడు మురుగదాస్ డైరెక్షన్ తో మదరాసి అనే ఓ యాక్షన్ థ్రిల్లర్ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే అన్నిహంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 05న ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీ లక్ష్మీ మూవీస్‌ నిర్మిస్తున్నఈ చిత్రంలో కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. దీంతో పాటు సుధా కొంగర దర్శకత్వంల పరాశక్తి అనే ఓ సినిమాను చేస్తున్నాడు శివ కార్తికేయన్. మల్టీ స్టారర్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ ప్రాజెక్టులో రవి మోహన్, అధర్వ, శ్రీలీల తదితర స్టార్స్ కూడా సందడి చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

భార్యా, పిల్లలతో హీరో శివ కార్తికేయన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి