Tollywood: ఆచితూచి అడుగులేస్తోన్న టాలీవుడ్ డైరెక్టర్స్.. ఎవరెవరు ఏ సినిమాలు చేస్తున్నారంటే

|

Feb 01, 2023 | 9:04 AM

జబర్దస్త్ హిట్లు ఇచ్చి, ఇన్ని నెలలు, ఇన్నేళ్లు ఎందుకు ఖాళీగా ఉంటున్నారంటూ ఆరాలు తీస్తున్నారు జనాలు.

Tollywood: ఆచితూచి అడుగులేస్తోన్న టాలీవుడ్ డైరెక్టర్స్.. ఎవరెవరు ఏ సినిమాలు చేస్తున్నారంటే
Tollywood
Follow us on

గ్యాప్‌ అనేదాని గురించి టాలీవుడ్‌లో కాస్త గట్టిగానే చర్చ జరుగుతోంది. డైరక్షన్‌ చేసిన లాస్ట్ సినిమా రిజల్ట్ కాస్త అటో ఇటో అయితే గ్యాప్‌ రావచ్చుగానీ, జబర్దస్త్ హిట్లు ఇచ్చి, ఇన్ని నెలలు, ఇన్నేళ్లు ఎందుకు ఖాళీగా ఉంటున్నారంటూ ఆరాలు తీస్తున్నారు జనాలు. ఇంతకీ ఆ ఫ్లడ్‌లైట్స్ ఎక్కువగా ఎవరి మీద పడుతున్నాయో తెలుసా..? సెన్సిబుల్‌ డైరక్టర్‌గా పేరుంది పరశురామ్‌కి. మంచి కమర్షియల్‌ పాయింట్‌లో ఫ్యామిలీ వేల్యూస్‌కి, కామెడీకి, సెంటిమెంట్స్ కి స్కోప్‌ ఇస్తూ అద్భుతంగా డైలాగులు రాసుకుంటారు. అందుకే ఆయన సినిమాల కోసం స్పెషల్‌గా వెయిట్‌ చేస్తుంటారు ఆడియన్స్. వాళ్లు వెయిట్‌ చేస్తారని పరశురామ్‌ ఏడాదికో సినిమా తీసేసిన సందర్భాలు కూడా తక్కువే. అన్నీ కుదిరాయని బలంగా ఫిక్స్ అయితేనే సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్తారు ఈ డైరక్టర్‌. లాస్ట్ ఇయర్‌ సర్కారువారి పాటతో హిట్‌ అందుకున్నారు పరశురామ్‌. నెక్స్ట్ ఏంటి? అనే ప్రశ్నకు ఇంకా ఆన్సర్‌ చెప్పట్లేదు ఈ కెప్టెన్‌.

అప్పుడెప్పుడో కరోనా టైమ్‌లో ఉప్పెన మూవీ చేసి సూపర్బ్ ఎంట్రీ అనిపించారు సానా బుచ్చిబాబు. లవ్‌స్టోరీని సరికొత్తగా ఆవిష్కరించి ఉప్పెనతో మంచి హిట్‌ అందుకున్నారు. డెబ్యూ హీరో వైష్ణవ్‌తేజ్‌ని 100 కోట్ల క్లబ్‌లో చేర్చిన రికార్డు కూడా ఆయనదే. ఉప్పెన తర్వాత తారక్‌తో సినిమా చేయడానికి వెయిట్‌ చేశారు బుచ్చిబాబు. అయితే ఆ ప్రాజెక్ట్ లేట్‌ అయ్యే సూచనలు ఉండటంతో, త్వరలోనే రామ్‌చరణ్‌ని డైరక్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. పవన్‌ కల్యాణ్‌ సినిమా వకీల్ సాబ్‌ డైరక్టర్‌ వేణు శ్రీరామ్‌. ఆ సినిమా కన్నా ముందే అల్లు అర్జున్‌తో ఐకాన్‌ మూవీ చేయాల్సింది. అయితే పవన్‌ కాల్షీట్ల కారణంగా… ముందు వకీల్‌సాబ్‌ పట్టాలెక్కింది. పింక్‌ రీమేక్‌గా తెరకెక్కిన వకీల్‌సాబ్‌కి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణే దక్కింది. పవర్‌స్టార్‌ మూవీని వేణు బాగా హ్యాండిల్‌ చేశారనే పేరు కూడా వచ్చిది.

వకీల్‌సాబ్‌ కంప్లీట్‌కాగానే ఐకాన్‌ మొదలుపెట్టేస్తారని అంతా అనుకున్నారు. అయితే ఇప్పుడు బన్నీ లైనప్‌లో వేణుశ్రీరామ్‌ నెంబర్‌ ఎంత అనేది మాత్రం ఇంకా సస్పెన్స్లోనే ఉంది. అలా వెయిటింగ్‌లో ఉన్న మరో డైరక్టర్‌ సాగర్‌ చంద్ర. అయ్యప్పనుం కోషియుం తెలుగు రీమేక్‌ భీమ్లానాయక్‌కి డైరక్టర్‌ సాగర్‌చంద్ర. భీమ్లానాయక్‌ రిలీజ్‌ అయి ఏడాది కావస్తున్నా, ఇంకే సినిమానూ స్టార్ట్ చేయలేదు సాగర్‌చంద్ర. బెల్లంకొండ శ్రీనివాస్‌తో ఓ ప్రాజెక్ట్ ఓకే అయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అన్నీ అనుకున్న ప్రకారం జరిగితే ప్రస్తుతం శ్రీనివాస్‌ చేస్తున్న బాలీవుడ్‌ ఛత్రపతి పూర్తయ్యాక సాగర్‌ చంద్ర మూవీ స్టార్ట్ అవుతుంది.