
వివాదాల దర్శకుడు ఆర్జీవీ.. వ్యూహం సినిమాకి సంబంధించి రెండో టీజర్ రిలీజ్ చేశారు. గతంలో ఎలక్షన్స్ సమయంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమా తీసి సంచలనం సృష్టించారు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ టైంకి వ్యూహం అనే పొలిటికల్ సినిమాతో రాబోతున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయాక జగన్‌పై జరిగిన కుట్రలు.. 2009 నుంచి 2014 వరకు ఏం జరిగింది? జగన్ కుటుంబంలో.. ఏపీ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేది వ్యూహం ఫస్ట్ పార్ట్‌లో చూపించబోతున్నట్టు స్పష్టమవుతోంది.
ఇప్పటికే వ్యూహం నుంచి ఒక టీజర్ విడుదల చేయగా లేటెస్ట్‌గా మరో టీజర్ రిలీజ్ అయింది. దట్టమైన అడవిలో హెలికాప్టర్ ప్రమాదంతో టీజర్ ప్రారంభమైంది. మధ్యలో జగన్, భారతి పాత్రలు కుట్రలు, కుతంత్రాలతో బాధపడుతున్నట్టుగా చూపించారు. చంద్రబాబు, పవన్‌ల భేటీలు కూడా టీజర్‌లో హైలైట్ చేశారు. మరోవైపు సోనియా, మన్మోహన్, రోశయ్యల పాత్రల్ని కూడా దింపేశారు. అయితే ఫైనల్‌గా పవన్ కల్యాణ్‌కి వెన్నుపోటు పొడవాల్సిన పనిలేదు.. తనకు తానే వెన్నుపోటు పొడుచుకుంటారని చంద్రబాబు పాత్రతో కూడిన డైలాగ్‌తో టీజర్‌ను ముగించారు.
ఇప్పటికే ఈ సినిమా ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచేసింది. ఆర్జీవి వ్యూహం సినిమా ఎలా తెరకెక్కిస్తున్నారు. ఎవరి పాత్రలను చూపించబోతున్నారు.? ఎలా చూపించనున్నారు.? ఇలా అనేక ప్రశ్నలు ఏపీ రాజకీయా నాయకుల్లో తలెత్తుతున్నాయి. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ పాత్ర ఎలా ఉండనుంది అన్న ఆసక్తి నెలకొంది.
రామ్ గోపాల్ వర్మ వ్యూహం మూవీ పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే పలు బయోపిక్స్ తీసి సంచలనాలు సృష్టించారు. ముఖ్యంగా రాజకీయ నాయకుల పై ఆయన తెరకెక్కించిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.