తన ఇంటి గేట్లు పెకిలించివేసిన ‘ది రాక్’​

|

Sep 19, 2020 | 5:20 PM

డ్వేన్​ జాన్సన్..ఈ పేరు చెబితే సదరు వ్యక్తి ఫేస్ అందరికి గుర్తుకురాకపోవచ్చు. 'ది రాక్'​  అని చెబితే మాత్రం కండలు తిరిగిన దేహం వెంటనే గుర్తుకువస్తుంది.

తన ఇంటి గేట్లు పెకిలించివేసిన ది రాక్​
Follow us on

డ్వేన్​ జాన్సన్..ఈ పేరు చెబితే సదరు వ్యక్తి ఫేస్ అందరికి గుర్తుకురాకపోవచ్చు. ‘ది రాక్’​  అని చెబితే మాత్రం కండలు తిరిగిన దేహం వెంటనే మైండ్  లో మెదులుతుంది. డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్​గా కెరీర్​ స్టార్ట్ చేసి, ప్రజంట్ హాలీవుడ్​లో ఆకట్టుకుంటున్నారు  నటుడు డ్వేన్​ జాన్సన్​. ఈ కండల వీరుడు తాజాగా తన ఇంటి గేట్లనే విరగ్గొట్టాడు. పవర్ కట్ వల్ల ఆయన ఇంటి గేట్లు  తెరుచుకోలేదు. దీంతో తన కోసం షూటింగ్ లో చాలామంది ఎదురుచూస్తున్నారని, తనే స్వయంగా ఆ గేటును పెకిలించివేసి షూటింగ్​కు వెళ్లారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా​ వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

“బహుశా ఈ రోజు నాకు సరిగా  లేదు అనుకుంటా. తుఫాను కారణంగా  పవర్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఫలితంగా మా ఇంటి గేట్ తెరుచుకోలేదు. వాటిని తెరిచేందుకు హైడ్రాలిక్ సిస్టమ్ ఉపయోగించి చూశా కానీ కుదరలేదు. వెంటనే కొంతమందికి ఫోన్​ చేసి గేటును ఎంత త్వరగా ఓపెన్​ చేయొచ్చో అడిగా. సుమారు 45 నిమిషాలు పడుతుందని చెప్పారు. కానీ, నా కోసం చాలా మంది షూటింగ్ స్పాట్ లో  ఎదురుచూస్తున్నారు. అందుకే గేటును పూర్తిగా నెట్టి, లాగి, పెకిలించేశాను” అని  డ్వేన్​ జాన్సన్​ పేర్కొన్నారు.

ఆ తర్వాత డ్వేన్​ జాన్సన్  భద్రత సిబ్బంది ఓ గంట తర్వాత టెక్నీషియన్లను పిలిపించారట. వారు గేటు చూసి భయపడ్డారని, అసలు ఇది ఎలా సాధ్యమైందని ఆశ్చర్యపోయారని డ్వేన్ వివరించారు .

Also Read :

ఏపీలో కల్తీ కూల్ డ్రింక్‌లు.. తస్మాత్ జాగ్రత్త !

క్రికెట్‌లో రేగిన దుమారం : కత్తులు, గొడ్డళ్లతో

త్వ‌ర‌లో పెళ్లి పీట‌లెక్క‌నున్న‌ త‌రుణ్‌ !