ప్యారడైజ్ కోసం ఎవరు ఎంత రెమ్యునరేషన్స్ తీసుకున్నారో తెలుసా.? సంపూర్ణేష్‌కు అంత తక్కువా..!!

నేచురల్ స్టార్ నాని, న్యాచురల్ స్టార్ నాని పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, గ్లింప్స్, టీజర్ అద్భుతమైన రెస్పాన్స్‌తో భారీ అంచనాలు పెంచాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ప్యారడైజ్ కోసం ఎవరు ఎంత రెమ్యునరేషన్స్ తీసుకున్నారో తెలుసా.? సంపూర్ణేష్‌కు అంత తక్కువా..!!
Nani

Updated on: Sep 23, 2026 | 7:13 PM

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ది ప్యారడైజ్ పై ప్రేక్షకుల్లో ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటివరకు విడుదలైన పాటలు సినిమాపై మంచి హైప్‌ను తీసుకురాగా.. మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేయకపోవడం మరింత క్యూరియాసిటీని పెంచుతోంది. అసలు సినిమాలో ఎలాంటి కథను చూపించబోతున్నారు. ? నాని పాత్ర ఎలా ఉండబోతోంది. ? అని ఆడియన్స్ లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్  A సర్టిఫికెట్ జారీ చేసింది. దీంతో ఈ చిత్రం ప్రధానంగా అడల్ట్ ఆడియన్స్, యూత్‌ను టార్గెట్ చేసేలా ఉండొచ్చనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ట్రైలర్ విడుదల చేయకుండా పాటలు, ప్రమోషనల్ కంటెంట్‌తోనే సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు మేకర్స్.

ఆ హీరోతో నటించడం నాకు ఇష్టం లేదు.. అందుకే ఒక్క సినిమాకూడా చేయలేదు..

దీంతో కథపై ప్రేక్షకుల్లో రకరకాల ఊహాగానాలు కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ‘ది ప్యారడైజ్’ అడ్వాన్స్ బుకింగ్స్‌కు మంచి స్పందన లభిస్తున్నట్లు ట్రేడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నాని సినిమాలకు ఉన్న మార్కెట్‌తో పాటు పాటలు క్రియేట్ చేసిన బజ్ కూడా దీనికి కారణంగా చెబుతున్నారు. ఇతర భాషల్లో పరిస్థితి ఎలా ఉన్నా.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సినిమాపై అంచనాలు గట్టిగానే కనిపిస్తున్నాయి. ది ప్యారడైజ్ ను నాని కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన చిత్రంగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా నిర్మాణానికి దాదాపు రూ.90 కోట్ల వరకు ఖర్చయినట్లు టాక్. యాక్షన్ సన్నివేశాలు, భారీ సెట్స్, టెక్నికల్ వర్క్ కారణంగా నిర్మాణ ఖర్చు పెరిగినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బడ్జెట్‌తో పాటు సినిమాలో నటించిన నటీనటులు, టెక్నీషియన్ల పారితోషికాలు కూడా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా.. ఆమె ఎవరో తెలుసా.?

సినిమాలో ‘జడల్’ అనే పాత్రలో నాని కనిపించనున్నారు. ఈ పాత్ర కోసం నాని రూ.30 నుంచి 35 కోట్ల మధ్య పారితోషికం తీసుకున్నట్లు టాక్.  అలాగే మోహన్ బాబు సికంజా మాలిక్ అనే విలన్ పాత్ర కోసం సుమారు రూ.5 కోట్లు తీసుకున్నట్లు టాక్. కీర్తి సురేశ్ ‘యేషనాగుల’ అనే స్పెషల్ సాంగ్‌లో కనిపించనున్న ఆమెకు సుమారు రూ.కోటి పారితోషికం ఇచ్చినట్లు సమాచారం. ఇక హీరోయిన్ కాయదు లోహర్రూ .1.5 కోట్లు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాఘవ్ జూయెల్ రూ.2  నుంచి 2.5 కోట్ల మధ్య, సంపూర్ణేశ్ బాబు  రూ.38 లక్షలు, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్రూ .15 కోట్లు వరకు రెమ్యునరేషన్ ఇచ్చినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే పాటలతో బజ్, భారీ బడ్జెట్, స్టార్ కాస్ట్, భారీ పారితోషికాలు.. ఇలా ‘ది ప్యారడైజ్’ చుట్టూ ఇప్పటికే చాలా అంశాలు ఆసక్తిని పెంచుతున్నాయి. సెప్టెంబర్ 24న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

ఆ హీరోయిన్‌తో నాకు గట్టిపోటీ ఉండేది.. ఇద్దరం తగ్గేవాళ్లం కాదు..! మీనా సెన్సేషనల్ కామెంట్స్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us