
న్యాచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన లేటేస్ట్ పీరియాడికల్ యాక్షన్ మూవీ ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజు మిక్స్ డ్ టాక్ వచ్చినా ఈ సినిమాకు రికార్డు కలెక్షన్లు వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు రూ. 160 కోట్లకు పైగాకలెక్షన్లు వచ్చినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఒక్క తెలుగులోనే కాదు ఇతర భాషల్లోనూ నాని సినిమాకు మంచి కలెక్షన్లు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఓవర్సీస్ లో ది ప్యారడైజ్ సినిమాకు రికార్డు వసూళ్లు వస్తున్నాయి. కాగా మాస్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ది ప్యారడైజ్ సినిమాలో భారీ తారగణమే ఉంది. నాని సరసన కయాదు లోహర్ కథానాయిక గా చేసింది. అలాగే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు శికంజా మాలిక్ అనే కరడుగట్టిన విలన్ పాత్రలో భయపెట్టాడు. వీరితో పాటు కామెడీ హీరో, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కూడా ది ప్యారడైజ్ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించాడు. బిర్యానీ అనే ఓ డిఫరెంట్ పాత్రలో ఆడియెన్స్ ను మెప్పించాడు. ఈ నేపథ్యంలో నాని సినిమా కోసం సంపూ కోసం ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడన్నది ఆసక్తికరంగా మారింది.
కాగా ది ప్యారడైజ్ సినిమా ప్రమోషన్లలో భాగంగా సంపూర్ణేష్ బాబు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా తన రెమ్యూనరేషన్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు. గతం లో తాను హీరోగా చేసినప్పుడు ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చేవారో, ది ప్యారడైజ్ సినిమాకు అంతకు మూడు రెట్లు రెమ్యూనరేషన్ ఇచ్చారని సంపూ చెప్పుకొచ్చాడు. గతంలో ఒక్కో సినిమాకు కోటి రూపాయలు పైనే పారితోషికం తీసుకున్నాడు బర్నింగ్ స్టార్. ఈ నేపథ్యంలో ది ప్యారడైజ్ సినిమా కోసం సంపూ సుమారు రూ. 3 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ తీసుకున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది.
Natural Star @NameisNani received a thunderous welcome from massive crowds at Krishna Theatre ❤🔥#TheParadise In Cinemas Now
🎟️ Book your tickets: https://t.co/XTkG9ueWdv
Natural Star @NameisNani in an @odela_srikanth cinema ❤️🔥
An @anirudhofficial musical 🎼@themohanbabu… pic.twitter.com/rw1alpD6gs— SLV Cinemas (@SLVCinemasOffl) September 30, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి