Tollywood: సింగిల్ స్క్రీన్ థియేటర్లను కాపాడేందుకు పర్సెంటేజ్ విధానం.. ఎలాగంటే..

కొన్నేళ్ల క్రితం డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల మధ్య పర్సెంటేజ్ పద్దతి ఉండేది. కానీ ఆ తర్వాతి కాలంలో ఎగ్జిబిటర్లకు రెంట్ మాత్రమే పే చేస్తూ వచ్చారు డిస్ట్రిబూటర్లు. దీనికి తోడు జీఎస్టీ కూడా వేయడంతో ఎగ్జిబిటర్ల కష్టాలు మరింత పెరిగాయి. తాజాగా సినిమా రిలీజ్‌లు లేకపోవడంతో ఆ నష్టాలు ఇంకా ఎక్కువై మూసేసే వరకు వచ్చింది పరిస్థితి. దీన్ని చక్కదిద్దేలా ఫిలించాంబర్ కీలక నిర్ణయాలు తీసుకుంది.

Tollywood: సింగిల్ స్క్రీన్ థియేటర్లను కాపాడేందుకు పర్సెంటేజ్ విధానం.. ఎలాగంటే..
Telugu Film Chamber
Follow us
Ram Naramaneni

|

Updated on: May 22, 2024 | 1:49 PM

సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడుతున్నాయి. డైలీ మెయింటనెన్స్ కష్టంగా మారడంతో తెలంగాణ ఎగ్జిబిటర్ల మనుగడ కష్టంగా మారింది. షేరింగ్ పద్ధతిలో సినిమాలను ఎలా ప్రదర్శించాలనే దానిపై మంగళవారం తెలంగాణ ఎగ్జిబిటర్స్ కంట్రోలర్స్ అసోసియేషన్ సమావేశమైంది. నైజాంలో సినిమాను కొన్న రేటు ప్రాతిపదికగా నెలలో నాలుగు వారాల కలెక్షన్లు ఎలా పంచుకోవాలనే దానిపై చర్చించారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లను కాపాడేందుకు గతంలో ఉన్న పర్సెంటేజ్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు.

కొన్నేళ్ల క్రితం డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల మధ్య పర్సెంటేజ్ పద్దతి ఉండేది. కానీ ఆ తర్వాతి కాలంలో ఎగ్జిబిటర్లకు రెంట్ మాత్రమే పే చేస్తూ వచ్చారు డిస్ట్రిబూటర్లు. దీనికి తోడు జీఎస్టీ కూడా వేయడంతో ఎగ్జిబిటర్ల కష్టాలు మరింత పెరిగాయి. తాజాగా సినిమా రిలీజ్‌లు లేకపోవడంతో ఆ నష్టాలు ఇంకా ఎక్కువై మూసేసే వరకు వచ్చింది పరిస్థితి. దీన్ని చక్కదిద్దేలా ఫిలించాంబర్ కీలక నిర్ణయాలు తీసుకుంది. మరోసారి పర్సెంటేజ్ విధాన్ని అమల్లోకి తీసుకొచ్చింది.

నైజాంలో 30కోట్లకు పైబడి హక్కులు కలిగిన సినిమాలకు తొలివారం డిస్ట్రిబ్యూటర్లకు 75శాతం, ఎగ్జిబిటర్లకు 25శాతం ఉండాలని, రెండో వారం 55, 45 పర్సంటేజ్, ఆతర్వాత వారాలకు 40-60, 30-70 శాతం తీసుకోవాలని నిర్ణయించారు. 10 కోట్ల నుంచి 30 కోట్ల రేటుకు కొన్న సినిమాలకు తొలివారం డిస్ట్రిబ్యూటర్లకు 60 శాతం, ఎగ్జిబిటర్లకు 40 శాతం లెక్కన పంపిణీ చేస్తారు. మలివారం చెరో 50శాతం, మూడోవారం 40-60, నాలుగోవారం 30-70 శాతం లెక్కన షేర్ చేసుకుంటారు.

ఇక 10కోట్ల లోపు సినిమాలకు తొలివారం డిస్ట్రిబ్యూటర్లకు 50శాతం, ఎగ్జిబిటర్లకు 50 శాతం వంతున పంపిణీ చేస్తారు. రెండో వారం 40-60, మూడోవారం 30-70 వంతున ఆదాయం పంచుకోవాలని ఎగ్జిబిటర్స్ కంట్లోలర్స్ అసోసియేషన్లో నిర్ణయించారు. జూన్ ఫస్ట్ నుంచి తాము తీసుకున్న నిర్ణయాలు అమల్లోకి వస్తాయని ప్రకటించారు. ఈ నిర్ణయంతో సింగిల్ స్క్రీన్ థియేటర్ల కష్టాలు కొంత వరకు తీరుతాయని అంటున్నారు ఇండస్ట్రీ పెద్దలు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

హైదరాబాద్ అల్లు ఆర్మీ ఉత్సాహం.! పుష్ప వైల్డ్ ఫైర్ జాతర
హైదరాబాద్ అల్లు ఆర్మీ ఉత్సాహం.! పుష్ప వైల్డ్ ఫైర్ జాతర
ఏడాదిలో ఒక్కసారే దొరికే లడ్డూ.! ఇప్పడు మిస్‌ అయితే మళ్లీ ఏడాదికే!
ఏడాదిలో ఒక్కసారే దొరికే లడ్డూ.! ఇప్పడు మిస్‌ అయితే మళ్లీ ఏడాదికే!
గొంతులో ఏదైనా ఇరుక్కుంటే ఎలా తీయాలి.? నీలోఫర్ వైద్యుల డెమో..
గొంతులో ఏదైనా ఇరుక్కుంటే ఎలా తీయాలి.? నీలోఫర్ వైద్యుల డెమో..
ఇలాంటి స్వీట్స్‌ మీరెప్పుడూ చూసి ఉండరు.! నోరూరిస్తున్న స్వీట్స్‌.
ఇలాంటి స్వీట్స్‌ మీరెప్పుడూ చూసి ఉండరు.! నోరూరిస్తున్న స్వీట్స్‌.
నెల రోజుల పాటు నాన్ వెజ్ మానేస్తే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
నెల రోజుల పాటు నాన్ వెజ్ మానేస్తే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
వైకల్యాన్ని ఓడించిన విజయ దీపిక.. టేబుల్ టెన్నిస్‌లో జాతీయ పతకాలు
వైకల్యాన్ని ఓడించిన విజయ దీపిక.. టేబుల్ టెన్నిస్‌లో జాతీయ పతకాలు
అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా