సినీనటుడు పృథ్వీరాజ్‌కు రోడ్డు ప్రమాదం

|

Oct 20, 2020 | 6:17 PM

ప్రముఖ నటుడు, ఎస్వీబీసీ మాజీ చైర్మన్ పృథ్వీరాజ్‌ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. సోమవారం ఈ యాక్సిడెంట్ జరిగిందంటూ పృథ్వీరాజ్‌ టీం ఆయన ఫేస్‌బుక్‌ అకౌంట్‌ ద్వారా తెలిపింది.

సినీనటుడు పృథ్వీరాజ్‌కు రోడ్డు ప్రమాదం
Follow us on

ప్రముఖ నటుడు, ఎస్వీబీసీ మాజీ చైర్మన్ పృథ్వీరాజ్‌ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. సోమవారం ఈ యాక్సిడెంట్ జరిగిందంటూ పృథ్వీరాజ్‌ టీం ఆయన ఫేస్‌బుక్‌ అకౌంట్‌ ద్వారా తెలిపింది. ‘బంజారాహిల్స్‌ క్యాన్సర్‌ ఆసుపత్రి వద్ద వినాయకుడి గుడి వైపు పృథ్వీరాజ్‌ కారు వెళ్తుండగా మరో కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన కారు ధ్వంసమైంది’ అంటూ ధ్వంసమైన కారు ఫొటోను షేర్‌ చేసింది. అయితే పృథ్వీకి ఏమైనా గాయాలయ్యాయా…? ఆయన  ఆరోగ్య పరిస్థితి గురించి ఎలా ఉందో సమాచారం ఇవ్వలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

గతంలో పృథ్వీరాజ్‌‌కు కరోనా సోకిన విషయం  తెలిసిందే. దీంతో హైదరాబాద్‌లోని ఓ క్వారంటైన్‌ సెంటర్‌లో చికిత్స తీసుకున్నట్లు ఆగస్టులో వీడియో ద్వారా తెలిపారు. పరీక్షల్లో నెగిటివ్ రిపోర్ట్ వచ్చినా సింటమ్స్  ఉండటంతో ముందు జాగ్రత్తలో భాగంగా ఆస్పత్రి క్వారంటైన్‌లో ఉండాలంటూ వైద్యులు సూచించినట్లు వివరించారు.

Also Read :

Bigg Boss Telugu 4 : అరియానాకు పెరుగుతోన్న ఫాలోయింగ్ ! 

Hyderabad Floods : ఎన్ని కష్టాలు వచ్చాయ్ బ్రదర్ !