ఇటీవల కాలంలో సినిమా టికెట్ల విషయంలో తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితుల గురించి తెలిసిందే. ఏపీలో రేట్లు తగ్గిస్తే .. తెలంగాణాలో మాత్రం రేట్లు పెంచారు. దాంతో ఏపీలో గందరగోళం నెలకొంది. ఆ తర్వాత సినీ పెద్దలంతా ఆ సమస్యను సీఎంతో చర్చించి పరిష్కరించుకున్నారు. అయితే ముందు నుంచి సినిమా ఇండస్ట్రీ కి సపోర్ట్ చేస్తూ వస్తున్న తెలంగాణ ప్రభుత్వం సినిమా టికెట్స్ ధరలను పెంచుతూనే వచ్చింది. తాజాగా కేజీఎఫ్ టీమ్ కు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ సర్కార్. కేజీఎఫ్ 2 సినిమా విషయంలోనూ టికెట్స్ ధరలు పెంచాలని నిర్ణయించింది సర్కార్. కే.జి.ఎఫ్ సినిమా టికెట్ రేట్లు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. మల్టీప్లెక్స్ ఐమాక్స్ థియేటర్స్ టికెట్ కు 50 రూపాయల చొప్పున సాధారణ ఎయిర్ కండిషన్, ఎయిర్ కూల్ థియేటర్లలో 30 రూపాయల చొప్పున టిక్కెట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించింది. సినిమా విడుదల తేదీ నుండి నాలుగు రోజులపాటు ధరలు పెంపు ఉండనుంది.
భారీ అంచలన మధ్య కేజీఎఫ్ సినిమా ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కేజీఎఫ్ మొదటి పార్ట్ భారీ విజయాన్ని అందుకోవడం తో ఇప్పుడు పార్ట్ 2 పై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు కన్నడ రాక్ స్టార్ యశ్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రానున్న కేజీఎఫ్ 2 ఇప్పటికే భారీ బిజినెస్ చేసింది. ఈ సినిమా రికార్డులు తిరగరాయడం ఖాయం అంటున్నారు చిత్రబృందం.
మరిన్ని ఇక్కడ చదవండి :