
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తోన్న చిత్రం ఓజీ. చాలా రోజుల నుంచి షూటింగ్ జరుపుకొంటోన్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఎట్టకేలకు రిలీజ్ కు సిద్దమైంది. దసరా కానుకగా సెప్టెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా ఓజీ థియేటర్లలో విడుదల కానుంది. కాగా ‘ఓజీ’ నిర్మాతల విజ్ఞప్తి మేరకు టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే ప్రీమియర్స్ షోస్ కు కూడా పర్మిషన్ ఇచ్చింది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఓజీ ప్రీమియర్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు శుక్రవారం (సెప్టెంబర్ 25) సాయంత్రం అధికారిక ఉత్తర్వులు విడుదలయ్యాయి. సెప్టెంబర్ 25న సినిమా రిలీజ్ కానుండగా 24న రాత్రి 9గంటలకు ప్రీమియర్‌కు అవకాశం ఇచ్చింది. దాని టికెట్ ధర జీఎస్టీతో కలిపి రూ.800. సినిమా విడుదల రోజు (ఈ నెల 25) నుంచి అక్టోబరు 4 వరకు టికెట్ ధరల పెంపునకు వీలు కల్పించింది. సింగిల్ స్క్రీన్స్‌లో రూ.100 (జీఎస్టీతో కలిపి), మల్టీప్లెక్స్‌ల్లో రూ.150 (జీఎస్టీతో కలిపి) పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. కాగా ఓజీ సినిమా టికెట్ల పెంపునకు అనుమతులిచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి ఓజీ నిర్మాత ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
పవన్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఓజీ మూవీ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. రన్ రాజా రన్, సాహో చిత్రాలతో ఆకట్టుకున్న సుజిత్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించింది. ప్రకాశ్ రాజ్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, ఇమ్రాన్ హష్మీ, వెంకట్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఓజీ సినిమా నుంచి రిలీజైన గ్లింప్స్, సాంగ్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఫైర్ స్ట్రోమ్ సాంగ్ యూట్యూబ్ రికార్డులను తిరగరాసింది. ఆ తర్వాత రిలీజైన మెలొడీ సాంగ్, లేటెస్ట్ గా వచ్చిన గన్స్ అండ్ రోజెస్ సాంగ్ కూడా ఫ్యాన్స్ కు తెగ నచ్చేశాయి. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఓజీ విజయ దశమి కానుకగా సెప్టెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
Idekkadaaaa masss ra mowaaa 🙏🏻🔥
Atlanta fans….♥️#OG #TheyCallHimOG pic.twitter.com/GofCA49vYl— DVV Entertainment (@DVVMovies) September 18, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.