
తమిళ్ స్టార్ హీరో శింబు (Simbu) మరోసారి చిక్కుల్లో పడ్డాడు.. శింబు కారు ఢీకొని ఓ వృద్ధుడు మృతి చెందిన ఘటనలో అతని కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మార్చి 18న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈనెల 18న రాత్రి శింబు తండ్రి.. నటుడు టీ. రాజేందర్ కారులో వెళ్తున్నారు. అదే సమయంలో ఓ వృద్దుడు పాకుతూ రోడ్డు దాటుతున్నాడు. అటు నుంచి వస్తున్న వాహనాల వెలుగులలో వృద్ధుడి గమనించని డ్రైవర్ కారు నడపడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన నటుడు టీ. రాజేంద్రన్ వెంటనే అంబులెన్స్‌కు సమాచారం అందించారు. ప్రమాదానికి కారమైన కారు డ్రైవర్‌ను కూడా ఆ వృద్దుడి వెంట ఆసుపత్రికి పంపించారు. ఆరోజు నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధుడు గురువారం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కన్ను మూశారు.
ఇదిలా ఉంటే.. ప్రమాదానికి కారణమైన శింబు కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ యాక్సిడెంట్‌కు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ నెట్టింట్లో వైరల్ అవుతుంది. దీంతో శింబు కుటుంబాన్ని విమర్శిస్తూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.. అయితే ఈ విషయంపై శింబు ఇంకా స్పందించలేదు. ప్రమాదానికి కారణమైన కారు హీరో శింబు పేరు మీద రిజిస్టర్ అయ్యి ఉండడంతో అతనిపై కేసు నమోదు చేశారు పోలీసులు.
Also Read: కార్తీకదీపం లెక్కలు మారిపోతున్నాయ్.. తికమక, సాగతీతతో ప్రేక్షకులలో విసుగు.. చివరకు..
Nithiin: మాచర్ల నియోజకవర్గం మూవీ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యేది అప్పుడే..
RRR: విడుదలకు ముందే ఊచకోత.. ప్రీమియర్స్‌లో ‘ఆర్ఆర్ఆర్’ కలెక్షన్ల సునామీ.. ఆ రికార్డ్ బ్రేక్’