Kamal Haasan: ఒకే ఒక్క మాటతో కన్నడనాట దుమారం రేపిన కమల్ హాసన్

కర్నాటకలో కమల్‌ హాసన్‌ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. థగ్‌లైఫ్‌ సినిమా ప్రమోషన్‌లో కన్నడ భాష పుట్టుకపై సంచలన కామెంట్స్‌ చేశాడు కమల్ హాసన్. తమిళం నుంచే కన్నడ భాష పుట్టిందంటూ కమల్ వ్యాఖ్యానించడంతో.. కన్నడ భాషాభిమానులు కన్నెర్రజేశారు .. ..

Kamal Haasan: ఒకే ఒక్క మాటతో కన్నడనాట దుమారం రేపిన కమల్ హాసన్
Kamal Haasan

Updated on: May 28, 2025 | 10:55 AM

థగ్‌లైఫ్‌ సినిమా ప్రమోషన్‌కి కన్నడ సూపర్‌స్టార్‌ శివరాజ్‌కుమార్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన ముందే కన్నడ భాష పుట్టుకపై సంచలన కామెంట్స్‌ చేశారు కమల్‌ హాసన్‌. ఇంతకీ, కన్నడ భాష పుట్టుకపై కమల్‌ ఏమన్నారో దిగువన వీడియోలో చూద్దాం..

తమిళం నుంచే కన్నడ భాష పుట్టిందంటూ కమల్‌ హాసన్‌ చేసిన ఈ వ్యాఖ్యలే ఇప్పుడు కర్నాటకలో మంటలు రేపుతున్నాయ్‌. కమల్‌ వ్యాఖ్యలపై కన్నడ పరిరక్షణ వేదిక తీవ్రంగా మండిపడుతోంది. కమల్‌ థగ్‌లైఫ్‌ సినిమాను కర్నాటకలో నిషేధించాలని.. ఆయన సినిమాలను కర్నాటకలో ఆడనివ్వబోమని హెచ్చరిస్తున్నారు

కన్నడిగుల్లో భాషాభిమానం తీవ్రస్థాయికి చేరింది. మాతృభాషను తప్ప మరో భాషను ఒప్పుకోబోమంటున్నారు కన్నడిగులు. ఏదైనా కన్నడలోనే ఉండాలి.. కన్నడలోనే మాట్లాడాలంటూ రచ్చ చేస్తున్నారు. సాధారణ ప్రజల దగ్గర్నుంచి సెలబ్రిటీస్‌ వరకు కన్నడ సెగ తగులుతోంది. ఇటీవలే, పాపులర్‌ సింగర్‌ సోనూనిగమ్‌కి షాక్‌ ఇచ్చారు కన్నడిగులు. రీసెంట్‌గా ఓ బ్యాంక్‌లో కన్నడ భాష మాట్లాడలేదని ఆందోళన చేశారు. ఈ వివాదాలు ఇంకా చల్లారక మందే.. తమిళం నుంచే కన్నడ పుట్టిందనడం అగ్గి రాజేసింది. తమిళ్‌ కంటే కన్నడ భాషే ప్రాచీనమైనదంటున్నారు కన్నడిగులు.

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.