
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చనిపోయి 20రోజులు అయినా అతడి జ్ఞాపకాలు పలువురిని వెంటాడుతున్నాయి. తాజాగా, నటి భూమిక సుశాంత్ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేసింది. సోషల్ మీడియా వేదికగా భావోద్వేగభరితమైన పోస్టు పెడుతూ.. సుశాంత్‌కు ఎలా పలకాలో వీడ్కోలు తెలియడం లేదంటూ ఎమోషనల్ అయ్యింది. అసలు అతడు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలను నిత్యం అన్వేశిస్తున్నట్లు వెల్లడించింది. మరోవైపు బాలీవుడ్ లో నిలదొక్కుకోవడం ఎంత కష్టమో వివరించింది భూమిక. ఒకవేళ సుశాంత్ మృతికి మానసిక ఒత్తిడి కారణమైతే..సంఘర్షణలు ఎవరితోనైనా పంచుకుంటే మనసు తేలికవుతుందని తెలిపింది. ఇప్పటివరకు 50 ప్లస్ మూవీస్ చేసినప్పటికీ.. తాను ప్రతి పాత్ర కోసం చిత్ర నిర్మాతలతో సంప్రదింపులు జరుపూనే ఉంటానని తెలిపింది.
సుశాంత్ ముంబైలోని తన ఫ్లాట్ లో ఇటీవల సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ బాలీవుడ్ హీరో హఠాన్మరణంతో యావత్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్ కు గురైంది. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసుల విచారణ జరుపుతున్నారు. సుశాంత్ ఆత్మహత్యకు బాలీవుడ్ లో నెపోటిజమే కారణమంటూ నెటిజన్లు భారీగా ట్రోలింగ్ చేస్తున్నారు.