Venkatesh Daggubati and Rana: తండ్రి కొడుకులుగా వెంకటేష్ , రానా.. ఆ మలయాళ సినిమా రీమేక్ లో దగ్గుబాటి హీరోలు

దగ్గబాటి హీరోలు వెంకటేష్ రానా  ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. వెంకటేష్ కుర్ర హీరోలకు పోటీగా బ్యాక్ ట్ బ్యాక్ హిట్స్ కొడుతూ దూసుకుపోతున్నారు.

Venkatesh Daggubati and Rana: తండ్రి కొడుకులుగా వెంకటేష్ , రానా..  ఆ మలయాళ సినిమా రీమేక్ లో దగ్గుబాటి హీరోలు
Venkatesh And Rana

Edited By:

Updated on: Feb 02, 2022 | 8:56 AM

Venkatesh Daggubati and Rana:దగ్గబాటి హీరోలు వెంకటేష్ రానా  ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. వెంకటేష్ కుర్ర హీరోలకు పోటీగా బ్యాక్ ట్ బ్యాక్ హిట్స్ కొడుతూ దూసుకుపోతున్నారు. ఇప్పటికే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నారప్ప సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. తమిళ్ లో వచ్చిన అసురన్ సినిమాకు రీమేక్ గా వచ్చిన ఈ సినిమా ఓటీటీ వేదికగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అలాగే దృశ్యం 2 సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు వెంకటేష్. దృశ్యం సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా కూడా ఓటీటీ వేదికగా విడుదలైంది. ఈ సినిమా కూడా మంచి టాక్ తో దూసుకుపోయింది.ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న వెంకీ ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 3 సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఎఫ్ 2 సినిమాకు సీక్వెల్ గా వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.  మరో వైపు రానా కూడా వరుస సినిమాలను లైనప్ చేస్తున్నాడు.

రానా ఇటీవలే అరణ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ఇప్పుడు విరాట పర్వం సినిమాతో సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో రానా నక్సలైట్ గా కనిపించనున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు రానా, వెంకటేష్ ఇద్దరు కలిసి ఓ వెబ్ సిరీస్ చేస్తున్నారని ఈ మధ్య టాక్ వచ్చిన విషయం తెలిసిందే. అలాగే ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి ఓ సినిమా చేయబోతున్నారని తెలుస్తుంది. మలయాళంలో విడుదలై సక్సెస్ టాక్ తెచ్చుకున్న ‘బ్రో డాడీ’ సినిమా సురేశ్ బాబుకి నచ్చిందట. దాంతో ఆయన ఈ సినిమాను వెంకటేశ్ – రానా ప్రధానమైన పాత్రలుగా రీమేక్ చేయాలనీ చూస్తున్నారట. మలయాళంలో తండ్రీ కొడుకులుగా మోహన్ లాల్ – పృథ్వీరాజ్ సుకుమారన్ నటించారు. మోహన్ లాల్ సరసన మీనా .. పృథ్వీరాజ్ జోడీగా కల్యాణి ప్రియదర్శన్ కనిపించనున్నారు. ఇప్పుడు ఈ సినిమాను వెంకీ రానాచేయనున్నారట.ఈసినిమా కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

TOP 9 ET News: క్రీడాకారుడిగా ఎన్టీఆర్‌ | RRR అడ్వాన్స్‌ బుకింగ్‌ ఎప్పటినుండి అంటే..(వీడియో)

Nithya Menon: బూరె బుగ్గల బాబ్లీ బ్యూటీ నిత్యామీనన్.. నయా ఫొటోస్ అదుర్స్..

Jayaprada: జయప్రద ఇంట తీవ్ర విషాదం.. హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరిన సీనియర్ నటి

Loading...
Unable to load recommendations.
Follow Us