
సూపర్ స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ మూవీ జైలర్ గురించి ఎంత చెప్పిన తక్కువే. చాలా కాలంగా సాలిడ్ హిట్ లేక కరువాసిపోయి ఉన్న ఫ్యాన్స్ కు అదిరిపోయే హిట్ ఇచ్చారు రజినీకాంత్ రోబో సినిమా తర్వాత ఆ రేంజ్ హిట్ అయినా సినిమా జైలర్. మధ్యలో రోబో 2 సినిమా వచ్చినప్పటికీ ఈ సినిమాకు కలెక్షన్స్ వచ్చాయి కానీ టాక్ అంతగా రాలేదు. దాంతో ఇప్పుడు జైలర్ సినిమా భారీ విజయం సాధించడంతో అభిమానులు పండగ చేసుకున్నటున్నారు. నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో తెరకెక్కిన జైలర్ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ఏకంగా 700కోట్లకు పైగా వసూల్ చేసి మరోసారి సూపర్ స్టార్ స్టామినా ఏంటో బాక్సాఫీస్ కు చూపించింది. తెలుగు, తమిళ్ భాషల్లో మాత్రమే జైలర్ సినిమా రిలీజ్ అయ్యింది. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందించారు.
ఇక ఈ సినిమా తర్వాత సూపర్ స్టార్ ఎవరితో సినిమా చేస్తున్నారు అన్నాడని పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ నయా మూవీ అప్డేట్ వచ్చేసింది. రజినీకాంత్ తన నెక్స్ట్ సినిమా లోకేష్ కనగ రాజ్ డైరెక్షన్ లో చేస్తున్నారు. విక్రమ్ సినిమాతో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన లోకేష్ ప్రస్తుతం దళపతి విజయ్ తో సినిమా చేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..