Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు సాయంతో మరో చిన్నారి గుండె పదిలం..

సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చూడటానికి హాలీవుడ్ హీరోలా కనిపించే ప్రిన్స్ మహేష్ టాలీవుడ్ లో నెంబర్ 1 హీరోగా కంటిన్యూ అవుతున్నాడు.

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు సాయంతో మరో చిన్నారి గుండె పదిలం..
Mahesh

Updated on: Mar 31, 2021 | 6:10 PM

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చూడటానికి హాలీవుడ్ హీరోలా కనిపించే ప్రిన్స్ మహేష్ టాలీవుడ్ లో నెంబర్ 1 హీరోగా కంటిన్యూ అవుతున్నాడు. వరుస విజయాలతో దూసుకు పోతున్న మహేష్ . ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. మహేష్ సినిమాలతోనే కాదు సేవాగుణంతోనూ కోట్లమంది అభిమానులను సంపాదించుకున్నారు.

వేల మంది చిన్నారులకు గుండె ఆపరేషన్స్ చేయించి ఆ చిన్నారుల తల్లిదండ్రుల పాలిట దైవంగా పిలవబడుతున్నాడు మహేష్. ఇప్పటివరకు సూపర్ స్టార్ మహేష్ 1020 మంది చిన్నారులకు గుండె సంబంధిత ఆపరేషన్స్ చేయించాడు. తాజాగా మరో పసి గుండెను కాపాడాడు. టి సుప్రీతా అనే చిన్నారి తీవ్రమైన గుండె జబ్బుతో బాధపడుతోంది. ఆమెకు అత్యంత ఖరీదైన వైద్య చికిత్స అవసరం. ఆ ఆపరేషన్ ను విజయవంతంగా నిర్వహించబడేలా చేసాడు మహేష్. ఈ వార్తను నమ్రత తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. దాంతో మరోసారి మహేష్ బాబు మరియు నమ్రతలపై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. అభిమానులంతా కామెంట్లతో సూపర్ స్టార్ మహేష్ బాబును ఆకాశానికెత్తేస్తున్నారు. సామి శిఖరం అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక మహేష్ నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో ముద్దుగుమ్మ కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. పరశురామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Acharya movie : ఆచార్య నుంచి మొదటి సాంగ్ వచ్చేసింది.. మరోసారి స్టెప్పులతో అదరగొట్టిన మెగాస్టార్

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us