సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమా పనుల్లో ఉన్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది, ఈ సినిమా కోసం మహేష్ బాబు అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. మహేష్ బాబు నటించిన లాస్ట్ మూవీ గుంటూరు కారం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవడంతో ఇప్పుడు రాజమౌళి సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్.. ఇక రాజమౌళి సినిమా ఆఫ్రికన్ ఫారెస్ట్ నేపథ్యంలో ఉంటుందని రాజమౌళి ఫాదర్ విజయేంద్ర ప్రసాద్ హింట్ ఇచ్చారు. దాంతో ఈ సినిమా పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మొన్నటికి మొన్న రాజమౌళి కూడా ఓ సింహం ఫోటోను షేర్ చేసి దానికి మహేష్ బాబును ట్యాగ్ చేశారు. దాంతో మహేష్ ఫ్యాన్స్ పొంగిపోయారు.
ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు డిఫరెంట్ లుక్‌లోకి మారిపోయారు. లాంగ్ హెయిర్, గుబురు గడ్డంతో రఫ్‌గా కనిపిస్తున్నాడు. సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాకపోవడంతో మహేష్ ఫ్యామిలీతో కలిసి వెకేషన్స్ కు వెళ్తున్నాడు. మహేష్ ఎయిర్ పోర్ట్ లో కనిపించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా మహేష్ బాబు, చిరంజీవి, నాగార్జున, రామ్ చరణ్ ఇలా పలువురు మాల్ దీవ్స్లో ప్రత్యక్షం అయ్యారు.
ఓ బిజినెస్ మాన్ బర్త్ డే వేడుకలో ఇలా స్టార్స్ అందరూ కనిపించారు. ఈ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ ఫొటోల్లో మహేష్ బాబు చాలా సింపుల్ గా కనిపించారు. వైట్ కలర్ టీ షర్ట్, రెడ్ కలర్ క్యాప్ తో క్యాజువల్ లుక్ లో కనిపించాడు. అయితే ఇప్పుడు ఆ టీ షర్ట్ ధర నెటిజన్స్ ను షాక్ అయ్యేలా చేస్తుంది. చూడటానికి సింపుల్ టీ షర్ట్ లానే ఉంది కానీ దాని ధర మాత్రం భారీగా ఉంది. గివెన్చీ బ్రాండ్ కు చెందిన ఈ టీ షర్ట్ ధర అక్షరాలా రూ. 74,000. సింపుల్ గా ఉన్న దాని ధర నెటిజన్స్ ను, అభిమానులను అవాక్ అయ్యేలా చేస్తుంది. ఈ టీషర్ట్‌కు మరీ ఇంత ఖరీదా అంటూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.