Nandamuri Balakrishna : బాలయ్యతో తలపడే విలన్ అతడేనా.. బిబి3 కోసం బాలీవుడ్ స్టార్ హీరోని దించుతున్న బోయపాటి….

నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను హీరో నటిస్తున్న సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారని మొదటి నుంచి..

Nandamuri Balakrishna : బాలయ్యతో తలపడే విలన్ అతడేనా.. బిబి3 కోసం బాలీవుడ్ స్టార్ హీరోని దించుతున్న బోయపాటి....

Updated on: Feb 16, 2021 | 3:32 PM

Nandamuri Balakrishna : నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను హీరో నటిస్తున్న సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారని మొదటినుంచి వార్తలు వస్తున్నాయి. వాటిలో ఒకటి అఘోర పాత్ర అని అంటున్నారు. ఇక ఆ మధ్య విడుదలైన ఈ సినిమా టీజర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసాయి. మరో  వైపు బోయపాటి కూడా ఫ్యాన్స్ అంచనాలకు ఎక్కడ తగ్గకుండా తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో బాలయ్యతో తలపడే విలన్ ఎవరంటూ టాలీవుడ్ లో చర్చ మొదలైంది. ఇందుకోసం బోయపాటి కొంతమంది బాలీవుడ్ నటులను ఎంపిక చేసేపనిలో ఉన్నారట. ఈ క్రమంలో మొదట కేజీఎఫ్ 2లో ‘అధీరా’గా నటిస్తున్న సంజయ్ దత్ ను అనుకున్నారని వార్తలు వచ్చాయి.

తాజాగా మరో బాలీవుడ్ నటుడి పేరు హల్ చల్ చేస్తుంది. అతడే సునీల్ శెట్టి. సునీల్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘దర్భార్’ సినిమాలో విలన్ గా నటించి మెప్పించారు. ఆతర్వాత కన్నడ హీరో సుదీప్ నటించిన ‘పహిల్వాన్’ లోఆకట్టుకున్నారు. ఇప్పుడు తెలుగులో మంచు విష్ణు నటిస్తున్న ‘మోసగాళ్లు’ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు సునీల్ శెట్టి. ఈ నేపథ్యంలోనే బాలయ్య సినిమాలో కూడా విలన్ గా సునీల్ నటిస్తున్నారని ఫిలింనగర్ లో టాక్ నడుస్తుంది. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై ‘బీబీ3’ అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న చిత్రానికి తమన్‌ సంగీత స్వరాలు సమకూరుస్తున్నారు. సమ్మర్ కానుకగా మే 28 ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Roberrt Movie : ‘శబరి ముందు తలొంచడం తెలుసు.. రావణుడి తల తుంచడమూ తెలుసు’.. ఆకట్టుకుంటున్న ‘రాబర్ట్’ ట్రైలర్..

Loading...
Unable to load recommendations.
Follow Us