Sumanth Ashwin: ఓ ఇంటివాడైన హీరో సుమంత్ అశ్విన్.. వైరల్ అవుతున్న పెళ్లి ఫొటోలు..

|

Feb 14, 2021 | 10:18 AM

Sumanth Ashwin: ప్రముఖ నిర్మాత ఎమ్‌ఎస్‌ రాజు కుమారుడు, టాలీవుడ్‌ యంగ్‌ హీరో సుమంత్‌ అశ్విన్‌ ఓ ఇంటివాడయ్యాడు.

Sumanth Ashwin: ఓ ఇంటివాడైన హీరో సుమంత్ అశ్విన్.. వైరల్ అవుతున్న పెళ్లి ఫొటోలు..
Follow us on

Sumanth Ashwin: ప్రముఖ నిర్మాత ఎమ్‌ఎస్‌ రాజు కుమారుడు, టాలీవుడ్‌ యంగ్‌ హీరో సుమంత్‌ అశ్విన్‌ ఓ ఇంటివాడయ్యాడు. హైదరాబాద్ కు చెందిన దీపికతో అతని వివాహం నగర శివార్లలోని ఫామ్ హౌస్ లో ఇరు వర్గాల కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. కరోనా నేపథ్యంలో కేవలం కుటుంబ సభ్యులు, కొద్ది మంది బంధువులు మాత్రమే ఈ వివాహ వేడుకకి హాజరయ్యారు. ‘తూనీగ తూనీగ’ సినిమాతో హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు సుమంత్‌. ఆతర్వాత ‘కేరింత’, ‘లవర్స్’‌, ‘ప్రేమకథా చిత్రం-2’ సినిమాల్లో నటించాడు. తాజాగా సుమంత్‌ నటించిన ‘మా కథ’ మూవీ కూడా మార్చి 19న విడుదలకు సిద్దంగా ఉంది. ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Radhe Shyam Movie: ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్.. ‘రాధేశ్యామ్‌’ టీజర్‌ వచ్చేసింది.. ఇక పండగే..