Aa Ammayi Gurinchi Meeku Cheppali: ఓటీటీలో ఆకట్టుకుంటోన్న ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి.. స్ట్రీమింగ్ ఎక్కడంటే

టాలీవుడ్ లో మంచి అభిరుచి కలిగిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న మోహన్ కృష్ణ ఇంద్రగంటి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో లేటెస్ట్ సెన్సేషన్ కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది.

Aa Ammayi Gurinchi Meeku Cheppali: ఓటీటీలో ఆకట్టుకుంటోన్న ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
Aa Ammayi Gurinchi Meeku Ch

Updated on: Oct 04, 2022 | 5:33 PM

యంగ్ హీరో సుధీర్ బాబు హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేసిన ఈ కుర్ర హీరో నటించిన లేటెస్ట్ మూవీ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. టాలీవుడ్ లో మంచి అభిరుచి కలిగిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న మోహన్ కృష్ణ ఇంద్రగంటి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో లేటెస్ట్ సెన్సేషన్ కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో మొదటి సారి కృతి డ్యూయల్ రోల్ లో నటించి మెప్పించింది. మంచి అంచనాలు మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కథ కథనం బాగున్నప్పటికీ ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ గా నిలిచింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో సందడి చేస్తోంది.

ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ లో అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో ఈ సినిమాకు మంచి ఆదరణే లభిస్తోంది. అందమైన ప్రేమ కథతో పటు. అమ్మాయిల ఆశలను చంపెయ్యొద్దు అనే మంచి సందేశాన్ని అందించారు దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ. సమ్మోహనం నుంచి ఇంద్రగంటి మోహనకృష్ణతో ట్రావెల్‌ చేస్తున్నారు సుధీర్‌బాబు.

సమ్మోహనం తర్వాత వీ సినిమా చేశారు. ఇప్పుడు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చేశారు. గత కొన్నాళ్లుగా పర్ఫెక్ట్ హిట్‌ కోసం వెయిట్‌ చేస్తున్న సుధీర్‌బాబుకి ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి కూడా ఆశించిన హిట్ ఇవ్వలేక పోయింది. ప్రస్తుతం హంట్ అనే యాక్షన్ సినిమా చేస్తున్నారు సుధీర్ బాబు. అటు కృతి తమిళ్ లో స్టార్ హీరో సూర్య సరసన ఛాన్స్ దక్కించుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us