Jr. NTR : తారక్ ఒక్కడే అది చేయగలడు.. ఎన్టీఆర్ పై నయనతార ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నాడు తారక్. ఆర్ఆర్ఆర్ సినిమాలో అద్భుతంగా నటించి.. ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎన్టీఆర్ కు మొదటి నుంచి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన నటించిన ఆంద్రావాలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పది లక్షలకు పైగా ఫ్యాన్స్ తరలి వచ్చారు. అంతేకాదు నాలుగు స్పెషల్ ట్రైన్స్ ను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ఒక్కటి చాలు తారక్ రేంజ్ ఏంటో చెప్పడానికి.

Jr. NTR : తారక్ ఒక్కడే అది చేయగలడు.. ఎన్టీఆర్ పై నయనతార ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Ntr
Follow us

|

Updated on: May 27, 2024 | 3:02 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొన్నటి వరకు టాలీవుడ్ స్టార్ హీరోగా ఉన్న తారక్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నాడు తారక్. ఆర్ఆర్ఆర్ సినిమాలో అద్భుతంగా నటించి.. ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎన్టీఆర్ కు మొదటి నుంచి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన నటించిన ఆంద్రావాలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పది లక్షలకు పైగా ఫ్యాన్స్ తరలి వచ్చారు. అంతేకాదు నాలుగు స్పెషల్ ట్రైన్స్ ను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ఒక్కటి చాలు తారక్ రేంజ్ ఏంటో చెప్పడానికి. అంతమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు మన యంగ్ టైగర్ ఎన్టీఆర్.

ఇక ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీ, డాన్స్ పర్ఫామెన్స్ మరో హీరో వల్ల కాదు అనడంలో అతిశయోక్తి లేదు. ఎలాంటి కష్ట తరమైన డైలాగ్ అయినా.. సింగిల్ టెక్ లో చెప్పగల నటుడు ఎన్టీఆర్. ఎలాంటి ఎమోషన్ అయినా అద్భుతంగా పలికించగల హీరో ఎన్టీఆర్. ఇప్పటికే ఎన్టీఆర్ గురించి చాలా మంది సినీ ప్రముఖులు ప్రశంసలు కురించారు. యంగ్ హీరోయిన్స్ కు మాత్రమే కాదు సీనియర్ హీరోయిన్స్ లోనూ కూడా తారక్ కు వీరాభిమానులు ఉన్నారు. ఉదాహరణకు సీనియర్ హీరోయిన్ ఖుష్బూ కు తారక్ అంతేవిపరీతమైన ఇష్టం..

ఇదిలా ఉంటే లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా ఎన్టీఆర్ పై ప్రశంసలు కురిపించింది. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో నయన్ తారక్ డాన్స్ గురించి క్రేజీ కామెంట్స్ చేసింది. నేను చాలా మందిని చూశాను డ్యాన్స్ చేయాలంటే ముందు రిహార్సిల్స్ చేసి ఆతర్వాత డాన్స్ చేస్తుంటారు. కానీ నాకు తెలిసి తారక్ ఒక్కడే రిహార్సిల్స్ లేకుండా కేవలం ఒక్కసారి చూసి డాన్స్ చేసేస్తాడు. అది ఎలాంటి మూమెంట్ అయినా సరే తారక్ అవలీలగా చేసేస్తాడు అంటూ ప్రశంసలు కురించారు నయనతార. ఈ కామెంట్స్ ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ తో కలిసి నయన్ అదుర్స్ అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం ఎన్టీఆర్ బాలీవుడ్ మూవీ వార్ తో పాటు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న దేవర మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వికపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
‘ప్రపంచ వేదికపై భారత్‌ గొంతుక’.. ప్రధాని మోదీ ఆసక్తికర ట్వీట్..
‘ప్రపంచ వేదికపై భారత్‌ గొంతుక’.. ప్రధాని మోదీ ఆసక్తికర ట్వీట్..
సోనాక్షి సిన్హా ఇంతమందితో ప్రేమాయణం నడిపిందా.?
సోనాక్షి సిన్హా ఇంతమందితో ప్రేమాయణం నడిపిందా.?
ఫ్యామిలీ వెకేషన్‎లో సందడి చేస్తున్న సీనియర్ పొలిటీషియన్.. ఎవరంటే
ఫ్యామిలీ వెకేషన్‎లో సందడి చేస్తున్న సీనియర్ పొలిటీషియన్.. ఎవరంటే
తక్కువ బడ్జెట్‌లో స్టన్నింగ్ ఫీచర్స్‌.. ఇన్‌ఫినిక్స్‌ కొత్త ఫోన్
తక్కువ బడ్జెట్‌లో స్టన్నింగ్ ఫీచర్స్‌.. ఇన్‌ఫినిక్స్‌ కొత్త ఫోన్
వార్నీ.. కొట్టింది రెండే సిక్సులు.. చరిత్ర సృష్టించాడుగా
వార్నీ.. కొట్టింది రెండే సిక్సులు.. చరిత్ర సృష్టించాడుగా
భారత్‌తో మ్యాచ్‌కు ఆఫ్ఘాన్ బిగ్ స్కెచ్.. రంగంలోకి తుఫాన్ ప్లేయర్
భారత్‌తో మ్యాచ్‌కు ఆఫ్ఘాన్ బిగ్ స్కెచ్.. రంగంలోకి తుఫాన్ ప్లేయర్
తెలంగాణలో సంచలనం.. చిన్నపొర్ల ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్..
తెలంగాణలో సంచలనం.. చిన్నపొర్ల ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్..
ఇదే అరాచకం సామీ..! తమన్నా సీన్స్ మొత్తం నెట్టింట వైరల్
ఇదే అరాచకం సామీ..! తమన్నా సీన్స్ మొత్తం నెట్టింట వైరల్
అవి అల్లర్లు కావు.. నాటి సిక్కుల ఊచకోతపై షార్ట్ ఫిల్మ్..
అవి అల్లర్లు కావు.. నాటి సిక్కుల ఊచకోతపై షార్ట్ ఫిల్మ్..
హ్యుందాయ్‌ కీలక నిర్ణయం.. రూ. 25,000 కోట్ల సమీకరణే లక్ష్యంగా
హ్యుందాయ్‌ కీలక నిర్ణయం.. రూ. 25,000 కోట్ల సమీకరణే లక్ష్యంగా