
సినిమాలే కాదు సినిమా సాంగ్స్ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ ఉంటాయి. కొన్ని సినిమాలను పాటలే నిలబెడుతుంటాయి.. చాలా సినిమాలు మ్యూజికల్ గా హిట్ అవుతుంటాయి. సినిమాలు ఏ రేంజ్‌లో హిట్ అవుతుంటాయో.. సాంగ్స్ అంతకు మించి హిట్ అవుతుంటాయి. చాలా సినిమాల సాంగ్స్ సినిమాలకు మించి విజయాలను అందుకుంటుంటాయి. ఇక ఇప్పటి సాంగ్స్ కంటే ఒకప్పటి సాంగ్స్ ప్రేక్షకులను ఉర్రుతలూగించేవి. ముఖ్యంగా 90కిడ్స్ సమయంలో వచ్చిన సాంగ్స్ ఎవర్ గ్రీన్ గా నిలిచాయి. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సాంగ్ కూడా అదే కోవకు చెందింది. ఈ సాంగ్ ఇప్పటికీ ట్రెండింగ్ లోనే ఉంది. ఇంతకూ ఆ సినిమా ఏంటి.? ఆ సాంగ్ ఎదో చూద్దామా..
ఈ సినిమా 2001లో విడుదలైంది. ఆ సినిమా మరేదో కాదు నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన నరసింహ నాయుడు. బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సంచలన విజయాన్ని అందుకుంది. ఈ యాక్షన్ ఎంటరైనర్ లో బాలయ్య అదరగొట్టారు. ఈము సినిమా 105 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుని రికార్డు సృష్టించింది. ఈ చిత్రం విజయవంతమవడంతో తెలుగు హీరోలందరూ ఫ్యాక్షన్ బాట పట్టారు. దగ్గర దగ్గర ఐదు సంవత్సరాలు ఫ్యాక్షన్ చిత్రాలు టాలీవుడ్ ను ముంచెత్తాయి. ఇక ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా సిమ్రాన్, ప్రీతి జింగ్యాని నటించారు.
ఈ సినిమాలోని సాంగ్స్ అన్ని సూపర్ హిట్ అయ్యాయి, ముఖ్యంగా చిలక పచ్చ కొక సాంగ్ మాములు హిట్ అవ్వలేదు. భువన చంద్ర రచించిన ఈ సాంగ్ ను మనో, రాధిక ఆలపించారు. అబ్బో ఈ సాంగ్ అప్పట్లో థియేటర్స్‌లో దుమ్మురేపింది. ఈ సాంగ్ వస్తే ఆడియన్స్ ఈలలు గోలలతో రచ్చ రచ్చ చేసేవారు. ఇక క్యాసెట్స్ లో, ఫంక్షన్స్ లో, ప్రతి ఇంట్లో ఇదే సాంగ్ వినిపించేది. ఊర్లల్లో ట్రాక్టర్లలో కూడా ఇదే సాంగ్ మారుమ్రోగేది. ఇప్పటికీ ఈసాంగ్ యూట్యూబ్ లో సెన్సేషన్ అనే చెప్పాలి. మిలియన్స్ కొద్దీ వ్యూస్ ను సొంతం చేసుకుంది ఈ సాంగ్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.