
బిగ్ బాస్ రియాలిటీ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ గేమ్ షోకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఇప్పటికే వివిధ భాషల్లో టెలికాస్ట్ అవుతూ ప్రేక్షకులను అలరిస్తుంది బిగ్ బాస్ గేమ్ షో.. హిందీ, తమిళ్, కన్నడ, మరాఠీ భాషలతో పాటు తెలుగులోనూ బిగ్ బాస్ షోకు ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. తెలుగులో ఇప్పటికే బిగ్ బాస్ షో 9 సీజన్స్ పూర్తి చేసుకుంది. త్వరలోనే బిగ్ బాస్ 10మొదలుకానుంది. బిగ్ బాస్ గేమ్ షోలో పాల్గొనాలని సామాన్యులతో పాటు సెలబ్రెటీలు కూడా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. అయితే బిగ్ బాస్ గేమ్ షోకు ఎంత పాజిటివ్ వచ్చిందో అంతే నెగిటివ్ కూడా వచ్చింది. చాలా మంది బిగ్ బాస్ గేమ్ షో మీద విమర్శలు చేశారు.
బిగ్ బాస్ లో పాల్గొన్న వారు కూడా బిగ్ బాస్ పై చాలా షాకింగ్ కామెంట్స్ చేశారు. కొంతమంది బిగ్ బాస్ గేమ్ షో స్క్రిప్ట్ అంటూ కూడా కామెంట్స్ చేశారు. కొంతమంది నెగిటివ్ మాత్రమే చూపించారని అసలైన ఆట మొత్తం ఎడిటింగ్ లో తీసేశారని కూడా ఆరోపణలు చేశారు. తాజాగా బిగ్ బాస్ గేమ్ షో మీద ఓ బ్యూటీ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. బిగ్ బాస్ మరాఠీ 6 సీజన్ ఇటీవలే పూర్తయ్యింది. ఈ సీజన్ లో సినీ నటి తన్వీ కొల్టే నిలిచింది. అయితే ఇదే సీజన్ లో మోడల్, నటి సోనాలి రౌత్ కూడా పాల్గొంది.
అయితే సోనాలి రౌత్ బిగ్ బాస్ కు నోటీసులు పంపించింది. రూ.2 కోట్లు నష్టపరిహారంగా చెల్లించాలని నోటీసులు పంపించిందని తెలుస్తుంది. బిగ్ బాస్ గేమ్ షో వల్ల తాను మానసిక, శారీరక క్షోభకు గురయ్యానని ఆమె తెలిపింది. అంతే కాదు బిగ్ బాస్ లోని వాతావరణం కారణంగా తనకు చర్మ సంబంధిత వ్యాధి (తామర) వచ్చిందని ఆరోపించింది. అందుకే షో నుంచి రెండు వారాల్లోనే బయటకు వచ్చేశా అని.. ఇప్పటికే మూడు నెలలు అవుతున్నా ఆ వ్యాధి తగ్గలేదని ఆమె ఆరోపించింది. ఈమేరకు సోనాలి రౌత్ సోషల్ మీడియాలో వీడియో షేర్ చేసింది. ఈ అమ్మడి వీడియో పై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.