నిన్నగాక మొన్న చైల్డ్ ఆర్టిస్టులగా నటించినవాళ్లు ఇప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై యాక్టర్స్‌గా అదరగొడుతున్నారు. ఆ బాలనటులే వీరే చెప్పడం అస్సలు నమ్మశక్యం కావడం లేదు. ముఖ్యంగా అమ్మాయిలు అయితే 5, 6 ఏళ్లలోనే హీరోయిన్స్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అలా హీరో హీరోయిన్స్ అయిన చైల్డ్ ఆర్టిసులు టాలీవుడ్‌లో చాలామందే ఉన్నారు. కింగ్ నాగార్జున హీరోగా నటించిన ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమాలో యాక్ట్ చేసిన ప్రణవి కూడా ఇప్పుడు కథనాయిక అయిపోయింది.
2016 వ సంవత్సరంలో రిలీజైన ‘సోగ్గాడే చిన్నినాయన’ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. అప్పట్లో ఈ సినిమాకు పోటీగా జూనియర్ ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’ కూడా రిలీజైంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ రెండు సినిమాల్లో ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమా విన్నర్‌గా నిలిచింది. అప్పట్లో.. 50 కోట్ల పైగా షేర్ సాధించిన ఈ చిత్రం.. నాగ్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా కొనసాగుతుంది.
ఇకపోతే ఈ చిత్రంలో మెయిన్ ఆర్టిస్టులతో పాటు చాలామంది చైల్డ్ ఆర్టిస్ట్స్ వెండితెరపై సందడి చేశారు. వారిలో ప్రణవి కూడా ఒకరు. తన ఇప్పుడు హీరోయిన్ అయిపోయింది. ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్ హీరోగా ‘స్లం డాగ్ హస్బెండ్’ అనే సినిమాలో హీరోయిన్‌గా నటించింది. అమ్మడు లుక్స్ చూసి.. నెటిజన్స్ స్టన్ అవుతున్నారు. బాబోయ్ మరి ఇంత మార్పు అని కామెంట్స్ పెడుతున్నారు. ఈ బ్యూటీ లేటెస్ట్ ఫోటలపై మీరూ ఓ లుక్ వేయండి…
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.