
మనందరం సోషల్ మీడియాలో రకరకాల మీమ్స్ చూస్తుంటాం.. నెట్టింట వచ్చే మిమ్స్ భలే నవ్వు తెప్పిస్తుంటాయి..
అయితే సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అయినా మీమ్ ఇది.. ఈ మీమ్ ను అందరూ చూసే ఉంటారు.. ఈ కుర్రాడి నవ్వు సోషల్ మీడియా మొత్తాన్ని చుట్టేసింది.. అతని నవ్వు ఎంతో మందిని నవ్వించింది.. ఆ ఒక్క నవ్వుతో రాత్రికి రాత్రి ఫేమస్ అయ్యాడు ఆ పిల్లాడు.. అయితే ఆ నవ్వు వెనకాల ఓ జీవిత పోరాటం ఉంది. చిన్న వయసులోనే ఎన్నో ఆర్ధిక సమస్యలను ఎదుర్కున్నాడు ఈ కుర్రాడు. ఇప్పుడు తనకు వచ్చిన క్రేజ్ తో సినిమాలో అవకాశాలు వస్తాయేమో అని ఎదురుచూస్తున్నాడు.
ఆ కుర్రాడి పేరు అరుణ్ కుమార్.. అతనిది జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మాదారం. చదువుకోవాల్లన్న ఆశ ఉన్నప్పటికీ ఆర్ధిక సమస్యల కారణంగా 3వ తరగతి వరకే చదివాడు. ఆతర్వాత చిన్న చిన్న పనులకు వెళ్లడం మొదలు పెట్టాడు. అలా చిన్నావయసులోనే జీవన పోరాటం మొదలు పెట్టాడు అరుణ్.. ఈ క్రమంలోనే తన బావ నెహ్రు దగ్గర లారికి క్లినర్ గా చేరాడు. రోజు తన బావతో కలిసి లారీకి వెళ్తున్నాడు.
ఒక రోజు తన బావ నెహ్రు సరదాగా వేసిన ఓ జోక్ కు అరుణ్ తనివితీరా నవ్వాడు.. ఆ నవ్వు నేటిజన్స్ ను ఆకట్టుకుంది.. ఆ వీడియో ఎంత వైరల్ అయ్యిందంటే.. ఎప్పుడు ఇంస్టాగ్రామ్ ఓపెన్ చేసిన మనోడే కనిపిస్తున్నాడు.. అయితే అరుణ్ ప్రస్తుతం ఓ షార్ట్ ఫిలిమ్ లో నటిస్తూ ఇండస్ట్రీలోకి రావాలని చూస్తున్నాడు.. అలాగే చదవాలన్నా తన ఆశాను కూడా వదలకుండా ఓపెన్ లో 10తరగతి పూర్తి చేశాడు. మరి ఈ వైరల్ కుర్రాడు సినిమాల్లో అవకాశాలు అందుకుంటాడేమో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.