మూడువారాలకే ఓటీటీలో.. ఈ సూపర్ హిట్ రూరల్ డ్రామాను మిస్ అవ్వకండి..

ఓటీటీల్లో రకరకాల సినిమాలు విడుదలై అలరిస్తున్నాయి. కొత్త సినిమాలు థియేటర్స్ లో దుమ్ము రేపుతుంటే కొన్ని క్రేజీ సినిమాలు ఓటీటీలో దూసుకుపోతున్నాయి. ఇప్పుడు ఓ కొత్త సినిమా థియేటర్స్ లోకి అడుగుపెడుతుంది. ఈ సినిమా థియేటర్స్ లో హిట్ టాక్ తెచ్చుకుంది.

మూడువారాలకే ఓటీటీలో.. ఈ సూపర్ హిట్ రూరల్ డ్రామాను మిస్ అవ్వకండి..
Tollywood Movie

Updated on: Jan 11, 2026 | 8:26 AM

ఓటీటీల పుణ్యమా అని ఆడియన్స్ డబుల్ ఎంటర్టైన్ అవుతున్నారు. థియేటర్స్ లో కొత్త కొత్త సినిమాలు విడుదలవుతుంటే.. ఓటీటీల్లో మాత్రం వరుసగా సినిమాలు విడుదలై ప్రేక్షకులను అలరిస్తున్నాయి. రకరకాల సినిమాలు విడులై ఆకట్టుకుంటున్నాయి. ప్రతి శుక్రవారం పదుల సంఖ్యలు సినిమాలు విడుదలై అలరిస్తున్నాయి. కేవలం తెలుగు సినిమాలే కాదు ఇతర బాషల సినిమాలు కూడా విడుదలై ఆకట్టుకుంటున్నాయి. ఇక కొత్త సినిమాలు కూడా థియేటర్స్ లో విడుదలైన నెల రోజులకే ఓటీటీలోకి వస్తున్నాయి. మరికొన్ని సినిమాలు వారాల్లోనే ఓటీటీలోకి విడుదలవుతున్నాయి. ఇక ఇప్పుడు ఓ కొత్త సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఆ సినిమా ఎదో కాదు శివాజీ, నవదీప్ నటించిన దండోరా..

అతన్ని పిచ్చి పిచ్చిగా ప్రేమించా.. కానీ బ్రేకప్ అయ్యింది.. దివి ఎమోషనల్ కామెంట్స్

క్రిస్మస్ కానుకగా గత ఏడాది డిసెంబరు 25న విడుదలైంది దండోరా సినిమా.. ఈ సినిమా పరువు హత్య నేపథ్యంలో తెరకెక్కింది.. అలాగే ఈ సినిమాలో శివాజీ, నవదీప్, బిందుమాధవి, రవికృష్ణ, నందు కీలక ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి టాక్ సొంతం చేసుకుంది. కానీ ఈ సినిమాకు కలెక్షన్స్ మాత్రం అంతగా రాలేదు. ఇక ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. తాజాగా దండోరా సినిమా అఫీషియల్ ఓటీటీ రిలీజ్ అప్డేట్ వచ్చేసింది.

13 ఏళ్లకే పెళ్లైంది.. ఇండస్ట్రీలో చాలా మంది నన్ను అలా చేయమని అడిగారు..

దండరా సినిమా కొన్ని థియేటర్స్ లో ఇప్పటికీ రన్ అవుతుంది. కాగా ఇప్పుడు ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14 నుంచి అమెజాన్ ప్రైమ్‌లోకి రాబోతుంది. పోస్టర్ కూడా విడుదల చేశారు. ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఇలాంటి సినిమాలను ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తూ ఉంటారు. ఇప్పటికే విడుదలైన రాజు వెడ్స్ రాంబాయి సినిమాకు కూడా థియేటర్స్ లో అలాగే ఓటీటీలో మంచి ఆదరణ దక్కింది. అలాగే దండోరా సినిమా కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. ఓటీటీలో ఎలా అలరిస్తుందో చూడాలి.

వయసు 20 ఏళ్లు.. ప్రభాస్, దళపతి విజయ్‌లను కూడా వెనక్కి నెట్టింది.. ఈ అమ్మడు ఎవరంటే

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.