Sir Movie: ‘సార్’ మూవీపై సీతారామం డైరెక్టర్ రివ్యూ.. మైండ్ బ్లోయింగ్ అంటూ ప్రశంసలు..

గతేడాది సీతారామం సినిమాతో హిట్ అందుకున్నారు హను రాఘవపూడి. అందమైన ప్రేమకథా చిత్రంలో మలయాళీ నటుడు దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా నటించగా..

Sir Movie: సార్ మూవీపై సీతారామం డైరెక్టర్ రివ్యూ.. మైండ్ బ్లోయింగ్ అంటూ ప్రశంసలు..
Sir Movie

Updated on: Feb 25, 2023 | 11:51 AM

తొలిసారి నేరుగా తెలుగులో నటించి సూపర్ హిట్ అందుకున్నారు తమిళ్ స్టార్ హీరో ధనుష్. డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన సార్ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి మార్కులు కొట్టేసింది. ఇందులో ధనుష్ సరసన మలయాళీ బ్యూటీ సంయుక్త మీనన్ నటించింది. పేద విద్యార్థులకు చదువును అందించేందుకు ఓ ఉపాధ్యాయుడు చేసే పోరాటమే సార్ చిత్రం. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా ప్రేక్షకుల నుంచి మంచి వసూళ్లు రాబడుతుంది. తాజాగా ఈ సినిమాపై సక్సెస్ ఫుల్ డైరెక్టర్ హనురాఘవపూడి రివ్యూ ఇవ్వడంతోపాటు.. డైరెక్టర్ వెంకీ అట్లూరి, హీరో ధనుష్ పై ప్రశంసలు కురిపించారు.

“సార్ సినిమాను చూశాను. నా ఊహతీతంగా ఉంది. ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరు చూడాల్సిందే. ధనుష్ గారు మరోసారి తన నటనతో కట్టిపడేశారు. వెంకీ అట్లూరి రైటింగ్, స్క్రీన్ ప్లై గానీ చాలా హానెస్ట్ గా ఉన్నాయంటూ” ట్వీట్ చేశారు. ఈ సినిమా కోసం కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిజేశారు. ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్ నెట్టింట వైరలవుతుంది.

ఇవి కూడా చదవండి

గతేడాది సీతారామం సినిమాతో హిట్ అందుకున్నారు హను రాఘవపూడి. అందమైన ప్రేమకథా చిత్రంలో మలయాళీ నటుడు దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా నటించగా.. సుమంత్, ప్రకాష్ రాజ్, గౌతమ్ మీనన్ ముఖ్య పాత్రలు పోషించారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us