
గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో త్రోబ్యాక్ పిక్చర్స్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. సామాన్యులే కాదు.. స్టార్ సెలబ్రెటీల చిన్ననాటి ఫోటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని భాషల్లోనూ ఫేమస్ నటీనటుల చిన్ననాటి జ్ఞాపకాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే అందులో కొందరి ఫోటోస్ చూడగానే ఇట్టే గుర్తుపట్టేస్తాము. ఇక మరికొందరిని మాత్రం అస్సలు గుర్తుపట్టలేము. రామ్ చరణ్, అల్లు అర్జున్, రష్మిక, కాజల్, పూజ హెగ్డే, ఎన్టీఆర్ వంటి స్టార్స్ బాల్యస్మృతులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా మరో హీరోయిన్ చిన్ననాటి జ్ఞాపకం ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఎవరో గుర్తుపట్టండి. పైన ఫోటోలో ఎంతో క్యూట్‌గా కనిపిస్తున్న చిట్టితల్లి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అయిన అమ్మడు ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం ఆమె నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం ప్రమోషన్లలో బిజీగా గడిపేస్తుంది. మీకోసం మరో క్లూ. ఈరోజు ఆ హీరోయిన్ పుట్టిన రోజు కూడా.
పైన ఫోటో ఉన్న చిన్నారి హీరోయిన్ మృణాల్ ఠాకూర్. ఇప్పుడు సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. మరాఠీ సినిమాలతో కెరీర్ ప్రారంభించిన మృణాల్ ఆ తర్వాత కుంకుమ భాగ్య సీరియల్ తో ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత ఆమె తొలిసారిగా నటించిన చిత్రం లవ్ సోనియా. తర్వాత సూపర్ 30, బట్ల హౌస్, తూఫాన్, ధమకా, జెర్సీ, రాధా చిత్రాల్లో నటించింది. ఇక ఇప్పుడు మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్, డైరెక్టర్ హను రాఘవపూడి కాంబోలో రాబోతున్న సీతారామం సినిమాలో నటిస్తోంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా ఆగస్ట్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈరోజు మృణాల్ ఠాకూర్ పుట్టినరోజు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.