Arjith Singh: ఆవేదన.. ఆక్రందన.. మౌనంగా బాధపడుతున్న మహిళల కోసమే ఈ పాట పాడుతున్నాను.. సింగర్ అర్జిత్ సింగ్ ..

నిత్యం జరుగుతున్న దిగ్భ్రాంతికరమైన ఘటనలకు సత్వరమే న్యాయం చేయాలని.. నింధితులను కఠినంగా శిక్షించాలని సామాన్య ప్రజలతోపాటు సెలబ్రెటీలు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ సింగర్ అర్జిత్ సింగ్ కోల్ కతాలో వైద్య విద్యార్థిని హత్యాచారం కేసులో న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. న్యాయం కోసం మౌనంగా బాధపడుతున్న మహిళల బాధను ఈ పాటలో తెలియజేస్తున్నాను.. ఇది కేవలం నిరసన కోసం కాదు.. చర్య కోసమే అంటూ ఓ పాటను రిలీజ్ చేశారు.

Arjith Singh: ఆవేదన.. ఆక్రందన.. మౌనంగా బాధపడుతున్న మహిళల కోసమే ఈ పాట పాడుతున్నాను.. సింగర్ అర్జిత్ సింగ్ ..
Arjith Singh
Follow us

|

Updated on: Aug 29, 2024 | 1:53 PM

ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకు అనుక్షణం భయమే. ఇప్పుడు అమ్మాయిలను బయటకు పంపించాలంటే భయంతో వణికిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దేశంలో ప్రతి నిమిషం ఎక్కడో ఒకచోట అమ్మాయిలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవలే కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం చేసి హత్య చేశారు. ప్రాణాలు కాపాడాల్సిన వైద్యురాలిని అత్యంత కిరాతకంగా హత్యచేశారు. బద్లాపూర్‌లో మైనర్ బాలికలపై స్కూల్ క్లీనర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. నిత్యం జరుగుతున్న దిగ్భ్రాంతికరమైన ఘటనలకు సత్వరమే న్యాయం చేయాలని.. నింధితులను కఠినంగా శిక్షించాలని సామాన్య ప్రజలతోపాటు సెలబ్రెటీలు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ సింగర్ అర్జిత్ సింగ్ కోల్ కతాలో వైద్య విద్యార్థిని హత్యాచారం కేసులో న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. న్యాయం కోసం మౌనంగా బాధపడుతున్న మహిళల బాధను ఈ పాటలో తెలియజేస్తున్నాను.. ఇది కేవలం నిరసన కోసం కాదు.. చర్య కోసమే అంటూ ఓ పాటను రిలీజ్ చేశారు.

“న్యాయం కోసం ఆవేదనతో ఈ పాట పాడుతున్నాను. ఇప్పుడు మౌనంగా బాధపడుతున్న ఎంతో మంది మహిళల కోసం.. సమాజంలో మార్పును కోరుకుంటున్న వారికోసమే ఈ పాట. మరణించిన వైద్యురాలి ధైర్యాన్ని కీర్తిస్తున్నాను.. భయంకరమైన హింసను ఎదుర్కొంటున్న మహిళలందరికీ సంఘీభావం తెలుపుతున్నాను. ఎన్నో ప్రమాదాలను ఎదుర్కొంటూ అవిశ్రాంతంగా సేవలు అందిస్తున్న వైద్యుల గళాన్ని ఈ పాట ప్రతిధ్వనిస్తుంది. ఇది కేవలం నిరసన గీతమే కాదు.. చర్యకు పిలుపు. మహిళల భద్రత, గౌరవం కోసం జరుగుతున్న పోరాటానికి ఇది మద్దతు ఇస్తుంది. వీరంతా గౌరవానికి అర్హులు. డాక్టర్ల అవిశ్రాంత కృషిని మదిలో తలచుకుంటూ ఈ పాట పాడాను” అంటూ అర్జిత్ సింగ్ తన ట్విట్టర్ లో రాసుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

అర్జిత్ సింగ్ రిలీజ్ చేసిన పాట టైటిల్ ‘ఆర్ కోబ్’. అంటే ‘ఇదంతా ఎప్పుడు ముగుస్తుందో..’ అంటూ పూర్తి పాటలో పిడికిలి కనిపిస్తుంది. ఈ పాటను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, అరిజిత్ సింగ్, ‘ఈ పాట కేవలం ఆందోళనకు మాత్రమే కాదు, యాక్షన్‌కు పిలుపు..’ అని క్యాప్షన్ ఇచ్చారు. సోషల్ మీడియాలో ఈ పాట వైరల్ అవుతోంది. అయితే చాలా మంది అరిజిత్ సింగ్‌ను విమర్శించారు. అరిజిత్ సింగ్ రియాక్ట్ కావడానికి ఇంత సమయం ఎందుకు తీసుకున్నారు? అంటూ ప్రశ్నిస్తున్నారు. మరికొందరు మాత్రం మహిళల ఆవేదన, ఆక్రందన ఈపాటలో చెప్పారంటూ అర్జిత్ సింగ్ ను ప్రశంసిస్తున్నారు.

View this post on Instagram

A post shared by Arijit Singh (@arijitsingh)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.