29 August 2024

కార్తీకదీపం వంటలక్క కూతురు హిమ ఇంత పెద్దదైపోయిందా.. ?

Rajitha Chanti

Pic credit - Instagram

బుల్లితెరపై దాదాపు ఏడేళ్లపాటు నంబర్ వన్ స్థానంలో దూసుకుపోయింది కార్తీక దీపం సీరియల్. ఇందులో వంటలక్క చిన్న కూతురిగా కనిపించి హిమ. 

వంటలక్క రెండో కూతురు హిమ పాత్రలో అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అమ్మాయి పేరు సహృద. ఇప్పుడు చాలా పెద్దదైపోయింది. 

ఒకప్పుడు సీరియల్లో ఎంతో అమాయకంగా కనిపించిన హిమ.. నిజానికి బయట మాత్రం చాలా అల్లరి పిల్ల. ముఖ్యంగా ఈ అమ్మాయి డాన్స్ ఇరగదీస్తుంది. 

ప్రస్తుతం హిమ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఇదిలా ఉంటే తాజాగా హిమ షేర్ చేసిన లేటేస్ట్ ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. 

వంటలక్క కూతురు హిమ ఇంత పెద్దదైపోయిందా ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా లంగావోణిలో అందమైన ఫోటోస్ షేర్ చేసింది హిమ. 

తాజాగా హిమ అలియాస్ సహృద షేర్ చేసిన ఫోటోస్ చూసి షాకవుతున్నారు నెటిజన్స్. ఇంత అందంగా మారిపోయిందేంటీ అంటూ అవాక్కవుతున్నారు. 

 ఒకప్పుడు కార్తీక దీపం సీరియల్లో నల్లగా కనిపించిన హిమ.. నిజానికి బయట మాత్రం చాలా క్యూట్, అందంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

ఇటీవలే బుల్లితెరపై ఢీ డ్యాన్స్ రియాల్టీ షోలో పాల్గొంది హిమ. అందులో డాన్స్ ఇరగదీసింది. కానీ తక్కువ సమయంలోనే ఆ షో నుంచి బయటకు వచ్చేసింది.