డీజే టిల్లు సినిమాతో ఓవర్ నైట్ లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు సిద్దు జొన్నలగడ్డ. ఇక ఈ సినిమాకు త్వరలోనే సీక్వెల్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే డీజే టిల్లు సీక్వెల్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాల్లో డీజే టిల్లు ఒకటి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీతో సిద్దు క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇందులోని డైలాగ్స్.. క్యాచీ పంచ్‌లు జనాలను ఆకట్టుకున్నాయి. ఏకంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లలో అట్లుంటది మరి మనతోని అంటూ డీజే డైలాగ్ వాడేసాడు. ఇక ఈ మూవీ సీక్వెల్ ఉంటుందని మేకర్స్ ప్రకటించడంతో.. ఈ చిత్రంపై అంచనాలు పెరిగిపోయాయి.
డీజే టిల్లు చిత్రానికి మించి ఉంటుందని టాక్ నడుస్తోంది. ఈ సీక్వెల్ అదిరిపోవడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ సినిమాను సెప్టెంబర్ 15న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు. గతంలో రిలీజ్ చేసిన గ్లింమ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇంట్రెస్టింగ్ వీడియో రిలీజ్ చేశారు ఆ చిత్ర నిర్మాణ సంస్త సితార ఎంటర్టైన్మెంట్స్.
ఈ సినిమా సీక్వెల్ కు ‘టిల్లు స్క్వేర్’ అని టైటిల్ ఫిక్స్ చేశారు. ఈసారి డబుల్ ఫన్, డబుల్ ఎంటర్టైన్మెంట్ ఉండనుందట. కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.
Our favourite, #DJTillu is gearing up for the biggest party in Theatres! ?#TilluSquare ~ A Mad ride begins 15th Sept, 2023! ?? #Siddu @anupamahere @MallikRam99 @ram_miriyala @SricharanPakala @NavinNooli #SaiPrakash @vamsi84 #SaiSoujanya @SitharaEnts @Fortune4Cinemas… pic.twitter.com/kMw276rggk
— Anupama Parameswaran (@anupamahere) June 5, 2023