
డీజే టిల్లు సినిమాతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు సిద్ధూ జొన్నలగడ్డ. ప్రేమలో దెబ్బతిన్న అబ్బాయి ఫీలింగ్స్‌ను మరో యాంగిల్లో బిగ్ స్క్రీన్ పై చూపించి అడియన్స్ ను ఫుల్ ఎంటర్టైన్ చేశాడు. రాధిక అంటూనే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టించాడు. అలాంటి హిట్ చిత్రానికి సీక్వె్ల్ వస్తుందంటే అంచనాలు సైతం రెట్టింపు ఉంటాయి. సిద్ధూ జొన్నలగడ్డ, నేహాశెట్టి కలిసి డీజే టిల్లు సినిమాలో నటించగా..ఇప్పుడు వచ్చిన సీక్వెల్ టిల్లు స్క్వేర్ మూవీలో నేహా స్థానంలో అనుపమ పరమేశ్వరన్ నటించింది. ఈ సినిమా విడుదలకు ముందే పాజిటివ్ బజ్ ఏర్పడింది. అంతేకాకుండా మొదటిసారి హద్దులు చేరిపేసి గ్లామరస్ లుక్స్..రొమాంటిక్ హీరోయిన్గా నటించింది అనుపమ. దీంతో ఈ మూవీని చూసేందుకు అడియన్స్ ఇంట్రెస్ట్ చూపించారు. ట్రైలర్, టీజర్, పాటలతో సినిమాపై ఆసక్తి కలిగించారు. ఇక ఈ మూవీ కోసం ఆతృతగా వెయిట్ చేస్తున్న అభిమానుల నిరీక్షణకు తెర పడింది. ఎట్టకేలకు ఈ మూవీ మార్చి 29న అడియన్స్ ముందుకు వచ్చింది.
డైరెక్టర్ మల్లిక్ విమల్ దర్శకత్వం వహించిన టిల్లు స్క్వేర్ సినిమాలో సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఈరోజు విడుదలైన సినిమాను ఇప్పటికే చూసిన అడియన్స్ సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు తెలియజేస్తుననారు. ఈ సినిమాలో సిద్ధూ మరోసారి రాకింగ్ పెర్ఫామెన్స్ అని.. అలాగే రాధిక ఎంట్రీ సర్ ప్రైజ్ అంటున్నారు.
ఎప్పటిలాగే సినిమా మొత్తాన్ని సిద్ధూ తన భూజాలపై నిలబెట్టాడని.. ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం ఆసక్తి కలిగించిందని అంటున్నారు. టిల్లు స్క్వేర్ పూర్తిగా 2 గంటల ఫన్ రైడ్ అని.. ఇక ఈ మూవీలో అనుపమ స్క్రీన్ ప్రెజన్స్ బాగుందని.. మొత్తానికి ఈసినిమా వినోదాన్ని పంచే రోలర్ కోస్టర్ అని అంటున్నారు. టిల్లన్న మ్యాజిక్ మళ్లీ రిపీట్ అయ్యిందని.. ఇక అనుపమ అదరగొట్టిందని అంటున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.