దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీపై షాకింగ్ ట్విస్ట్..!

దళపతి విజయ్ తమిళనాడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడని ఓ వార్త రెండు మూడు రోజులుగా కోలీవుడ్ మీడియాలో హాల్‌చల్‌ చేస్తోంది. విజయ్‌.. చాలా తక్కువ టైమ్‌లోని

దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీపై షాకింగ్ ట్విస్ట్..!

Edited By:

Updated on: Nov 06, 2020 | 8:26 AM

Thalapathy Vijay Political Entry: తమిళ రాజకీయాల్లోకి సినిమా హీరోల ఎంట్రీ సర్వ సాధారణం.. ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి, శరత్ కుమార్, విజయ్ కాంత్, కమల్ హసన్, ఖుష్బు, రాధిక మొదలగున వారు రాజకీయ రంగం ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా దళపతి విజయ్ తమిళనాడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడని ఓ వార్త రెండు మూడు రోజులుగా కోలీవుడ్ మీడియాలో హాల్‌చల్‌ చేస్తోంది. విజయ్‌.. చాలా తక్కువ టైమ్‌లోని కోలీవుడ్‌లో సూపర్‌స్టార్‌గా ఎదిగారు. కేంద్రాన్ని కూడా కుదిపేసి.. వివాదాల దాకా వెళ్లి వచ్చారు. ఆ పాపులారిటీకి తోడు ఆయనకున్న అభిమానాలు కోకొల్లలు. ఆయన రాజకీయాల్లోకి రావాలని.. తమిళనాడును శాసించాలని ఫ్యాన్స్ ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. దీనికి తగ్గట్టుగానే సడెన్‌గా సోషల్ మీడియాలో ఆయన రాజకీయ పార్టీ పెట్టేసినట్లు వార్తలు వచ్చేశాయ్‌. ”ఆలిండియా.. దళపతి విజయ్‌ మక్కల్‌ ఇయక్కం” అనే పేరును ఎన్నికల సంఘంలో రిజిస్ట్రేషన్ చేశారని.. త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారని నెట్టింట్లో ప్రచారం జరిగింది. దీనితో ఆయన రాజకీయాల్లోకి వచ్చేసినట్లే అని అందరూ ఫిక్సయ్యారు.

సీన్ కట్‌ చేస్తే.. విజయ్ వైపు నుంచి ఓ క్లారిటీ వచ్చింది. తాను ఏ పార్టీ పెట్టలేదని, ఏ పార్టీ పేరూ రిజిస్ట్రర్ చేయించలేదని, తాను రాజకీయాల్లోకి ఇప్పటి వరకూ అయితే రాలేదని చెప్పేశారు. మరి… విజయ్ పార్టీ పెట్టకుండా, విజయ్ పేరు మీద పార్టీ రిజిస్ట్రర్‌ చేసిందెవరు? సోషల్ మీడియాలో ఆ వార్తలేంటీ? అని అనుకుంటే మరో ట్విస్ట్ బయటపడింది. ఆ పార్టీ పెట్టింది తండ్రి ఎస్ ఏ చంద్రశేఖర్. దీనిపై విజయ్ తరపు నుంచి ఓ ప్రెస్‌ నోట్ విడుదలైంది. దాని ప్రకారం.. మీడియా ద్వారా తన తండ్రి ఓ రాజకీయ పార్టీ స్థాపించబోతున్నట్లు తెలిసిందని అందులో విజయ్ పేర్కొన్నారు.

తన తండ్రి పార్టీతో తనకు ఏ సంబంధం లేదని.. తన అభిమానులు ఎవరూ కూడా ఆ పార్టీలో సంబంధాలు పెట్టుకోవద్దని విజయ్ తెలిపారు. విజయ్ ఇచ్చిన ప్రకటనలో గమనించాల్సిన మరో విషయం.. తన తండ్రితో ఉన్న విబేధాలు. ఆయన పెట్టిన పార్టీలో తనను గానీ, తన ఫోటోలను గానీ.. ఏ రూపంలో వాడినా చర్యలుంటాయని చెప్పారు. అంటే విజయ్‌ ఇంట్లో విబేధాలున్నాయా అన్నది ఆయన ప్రకటనలో కనిపిస్తున్న కొత్త విషయం. ఇంతకీ విజయ్‌ రాజకీయాల్లోకి వచ్చారా.. రాలేదా.. ! లేదంటే విజయ్ నో చెబుతున్నా.. ఆయన ఫ్యామిలీ రాజకీయాల్లోకి లాగుతోందా? అన్నది తేలాల్సిన ప్రశ్న.

Follow Us