చాలాకాలం తర్వాత ‘పఠాన్’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు షారుఖ్ ఖాన్. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ ఫిల్మ్ వరల్డ్ వైడ్ 1000 కోట్ల కలెక్షన్స్ దిశగా దుమ్మురేపుతుంది. షారుఖ్ కెరీర్‌లోనే ఇవి టాప్ కలెక్షన్స్. ఆ జోష్‌లోనే మన సౌత్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో జవాన్ మూవీలో నటిస్తున్నాడు. ఇందులో నయన్ హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా షూటింగ్ షెడ్యూల్ నిమిత్తం చెన్నైకి వచ్చిన షారుఖ్.. నయన్ ఇంటికి వెళ్లి ఆతిథ్యం స్వీకరించారు. అక్కడి నుంచి తిరిగి వెళ్లే క్రమంలో… షారుఖ్‌కు నయనతార సెండాఫ్ ఇస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ సమయంలో కారులో నుంచే నయన్ బుగ్గపై ముద్దు పెట్టి బై చెప్పారు షారుఖ్. అది కూడా చాలా క్యూట్‌గా. చాలా వార్మ్‌గా. ఈ సీన్ నెటిజన్స్ దృష్టిని ఆకర్షించింది.
The way Shah Rukh kissed Nayanthara goodbye @iamsrk you have my whole heart ?❤️ #Nayanthara #Jawan pic.twitter.com/0zoBaBQGMP
— Samina ✨ (@SRKsSamina_) February 11, 2023
ఆ వీడియోపై రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. ఈ కపుల్ కెమిస్ట్రీ వెండితెరపై నెక్ట్స్ లెవల్‌లో ఉంటుందని ఒకతను కామెంట్ పెట్టగా.. నయన్‌పై షారుఖ్ కన్‌సర్న్ చాలా బాగుందని మరో వ్యక్తి పేర్కొన్నాడు. ప్రజంట్ దర్శకుడు అట్లీ.. చెన్నైలో షారుఖ్‌పై కొన్ని సీన్లు షూట్ చేస్తున్నాడు. నయనతార ఫైనల్ షెడ్యూల్‌లో జాయిన్ అవ్వనుంది. ఇక ఫ్యాన్స్ చాలా ఈగర్‌గా ఎదురుచూస్తున్న ఈ పాన్-ఇండియా మూవీ ఇదే ఏడాది జూన్‌లో థియేటర్లలోకి రానుంది. కాగా ఈ చిత్రంలో విజయ్ సేతుపతి విలన్ రోల్ చేస్తున్నట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. సన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్, ప్రియమణి, యోగి బాబు కీ రోల్స్ పోషిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..