బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ సినిమా సంచలనం సృష్టిస్తోంది. షారుక్ సినిమా కోసం ఆయన అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూశారు. రీసెంట్ గా పఠాన్ సినిమాతో ఆయన ప్రేక్షకుల ముందుకు వచ్చారు. జీరో సినిమా తర్వాత షారుక్ హీరోగా నటించిన సినిమా పఠాన్. రిపబ్లిక్ డే పురస్కరించుకొని జనవరి 25న పఠాన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. విడుదలకు ముందు ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, టీజర్స్, ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
ఇదిలా ఉంటే పఠాన్ సినిమాలోని కొన్ని దృశ్యాలపై హిందూ సంస్థలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయినా కూడా ఆ వివాదాలను దాటి పఠాన్ సినిమా విడుదలై మంచి హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ తో రూ.50 కోట్లు రాబట్టింది ఈ మూవీ. ఇప్పుడు కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది.
తాజాగా ఈ సినిమా ఇప్పుడు వేయి కోట్ల దిశగా దూసుకుపోతోంది.. కేవలం 19 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 950 కోట్ల వసూళ్లను సొంతం చేసుకుంది. ఇక మరి కొద్దిరోజుల్లో వేయి కోట్ల మార్క్ ను రీచ్ అవ్వనుంది. ఆదివారం కూడా పఠాన్ సినిమాకు భారీగానే కలెక్షన్స్ వచ్చాయి. వరల్డ్ వైడ్ గా 7700 స్క్రీన్స్ లో విడుదలైంది ఈ సినిమా..