20 ఏళ్ల క్రితం మహేష్‌బాబు చేసిన క్యారెక్టర్‌‌లో బాలీవుడ్ టాప్‌ హీరో! స్టోరీ కూడా అదేనా?

టాలీవుడ్‌లో ప్రతి సినిమాకి విభిన్నమైన పాత్రలను ఎంపిక చేసుకుంటూ అభిమానులను అలరిస్తున్నారు సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు. ఆయన నటించిన సినిమాల్లోని పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ప్రస్తుతం ఆయన రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ సినిమాగా తెరకెక్కుతున్న వారణాసి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

20 ఏళ్ల క్రితం మహేష్‌బాబు చేసిన క్యారెక్టర్‌‌లో బాలీవుడ్ టాప్‌ హీరో! స్టోరీ కూడా అదేనా?
Maheshbabu And Star Hero

Updated on: Jan 01, 2026 | 10:51 AM

దాదాపు 20 ఏళ్ల క్రితం మహేష్‌బాబు చేసిన క్యారెక్టర్‌‌ ఇప్పటికీ చాలా మందికి ఫేవరెట్. ఆ పాత్రలో మహేష్ నటన అందరినీ ఆకట్టుకుంది. థియేటర్లలో అభిమానులను అలరించిన ఆ సినిమా బుల్లితెర ప్రేక్షకులనూ ఆకట్టుకుంది. ప్రస్తుతం అటువంటి క్యారెక్టర్ చేయడానికి బాలీవుడ్ స్టార్ హీరో రెడీ అవుతున్నారని తెలుస్తోంది. బాలీవుడ్‌లో వరుస హిట్లతో దూసుకుపోతున్న ఆ స్టార్ హీరో మహేష్‌ క్యారెక్టర్‌‌పై మనసుపారేసుకున్నారని ఆ తరహా పాత్రలో చేయడానికి రెడీ అయ్యారని చెబుతోంది. ఇంతకీ ఆ బాలీవుడ్ స్టార్ ఎవరో తెలుసా? వరుసగా రెండు భారీ హిట్స్‌తో బాక్సాఫిస్‌ దగ్గర సందడి చేసిన బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ఖాన్‌

షారూఖ్ ఖాన్ తన కుమార్తె సుహానాతో కలిసి నటిస్తున్న సినిమా ‘కింగ్’. ఈ చిత్రం గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో షారూఖ్ ప్రొఫెషనల్ కిల్లర్ పాత్ర చేస్తున్నట్లు సమాచారం. ఇది మహేష్ బాబు 2005లో చేసిన ‘అతడు’ సినిమాలోని పాత్రను పోలి ఉంటుందనే చర్చ జరుగుతోంది.

‘అతడు’లో మహేష్ బాబు ప్రొఫెషనల్ కిల్లర్‌గా కనిపించి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఆ పాత్ర ఆయన కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది. ఇప్పుడు షారూఖ్ ఖాన్ ‘కింగ్’లో అలాంటి గ్రే షేడెడ్ పాత్రలో కనిపించనున్నారు. అయితే కథ పూర్తిగా భిన్నంగా ఉంటుందని, భారీ యాక్షన్ సీక్వెన్స్‌లతో పాటు ఎమోషనల్ డ్రామా కూడా ఉంటుందని తెలుస్తోంది. సుహానా ఖాన్ థియేట్రికల్ డెబ్యూ ఈ సినిమాతోనే కావడం ప్రత్యేకం.

Shah Rukh Khan & Athadu Poster

ఈ చిత్రంలో షారూఖ్ ఒక శక్తివంతమైన డాన్‌గా, అంతర్జాతీయ క్రిమినల్‌గా కనిపించనున్నారు. సుహానా పాత్రను మెంటర్ చేస్తూ, ఆమెను రక్షిస్తూ ఉంటాడు. ఫ్రెంచ్ ఫిల్మ్ ‘లియాన్: ది ప్రొఫెషనల్’ నుంచి స్ఫూర్తి పొందినట్లు సమాచారం. దీపికా పదుకొణె, అభిషేక్ బచ్చన్, అనిల్ కపూర్ వంటి స్టార్లు కూడా నటిస్తున్నారు.

‘కింగ్’ 2026లో థియేటర్లలో రిలీజ్ కానుంది. పఠాన్ వంటి భారీ విజయం తర్వాత సిద్ధార్థ్ ఆనంద్‌తో షారూఖ్ మళ్లీ సినిమా చేస్తుండటం హైలైట్. భారీ బడ్జెట్‌తో, అంతర్జాతీయ లొకేషన్లలో షూటింగ్ జరుగుతోంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. అతడును పోలిన క్యారెక్టర్‌‌లో షారూఖ్ కనిపిస్తాడనే టాక్ టాలీవుడ్, బాలీవుడ్ అభిమానుల మధ్య ఆసక్తి రేకెత్తిస్తోంది. మొత్తంగా ‘కింగ్’ బ్లాక్‌బస్టర్ అవుతుందనే అంచనాలు బలంగా ఉన్నాయి.