Kavya Shree: ఆ నటుడు కెమెరా ఉన్నప్పుడు ఒకలా.. లేనప్పుడు మరోలా బిహేవ్ చేస్తాడు.. కావ్యశ్రీ షాకింగ్ కామెంట్స్

ఈసారి బిగ్ బాస్ కంటెస్టెంట్ల లిస్టులో కావ్యశ్రీ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. బుల్లితెరపై ఆమె కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఎలాగైనా ఈ నటిని హౌస్ లోకి తీసుకురావాలని నిర్వాహకులు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. అటు కావ్యశ్రీకి కూడా బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసేందుకు ఆసక్తిగా ఉందని సమాచారం.

Kavya Shree: ఆ నటుడు కెమెరా ఉన్నప్పుడు ఒకలా.. లేనప్పుడు మరోలా బిహేవ్ చేస్తాడు.. కావ్యశ్రీ షాకింగ్ కామెంట్స్
Serial Actress Kavya Shree

Updated on: Jul 21, 2026 | 4:00 PM

సీరియల్ హీరోయిన్ కావ్యశ్రీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. పేరుకు కన్నడ నటినే అయినప్పటికీ తెలుగులోనే ఈ బ్యూటీకి క్రేజ్, పాపులారిటీ ఎక్కువ. గోరింటాకు సీరియల్ ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది కావ్య. ఆ తర్వాత కోయిలమ్మ, గువ్వా గోరింకా తదితర సూపర్ హిట్ సీరియల్స్‌ లో నటించి తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైపోయిందీ అందాల తార. కేవలం సీరియల్సే కాకుండా పలు ఎంటర్‌టైన్‌మెంట్ షోలలో కావ్యశ్రీ పాల్గొంటోంది. కాగా బిగ్ బాస్ సీజన్ – 8 విజేత నిఖిల్ తో కావ్యశ్రీ ప్రేమాయణం నడిపింది. చాలా ఏళ్ల పాటు వీరు కలిసి మెలిసి తిరిగారు. అయితే ఏమైందో తెలియదు కానీ ఇద్దరూ విడిపోయాడు. ఇదిలా ఉంటే కొద్దిరోజుల క్రితం ఓ టీవీ షోకు హాజరైన కావ్యశ్రీ బుల్లితెర నటుడు తేజస్ గౌడపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

 

ఇవి కూడా చదవండి

కొద్దినెలల క్రితం స్టార్ యాంకర్ సుమ కనకాల ఓ టీవీ ఛానెల్ లో నిర్వహించిన షోకు కావ్యశ్రీ కూడా హాజరైంది. ఈ సందర్భంగా పక్క వాళ్లలో ఏ మార్పు వస్తే మంచిది అనే కారణం చెబుతూ వారి ఫొటోను నిప్పుల్లో కాల్చాలని టాస్క్ ఇచ్చింది సుమ. దీనికి గానూ కావ్యశ్రీ ముందుకొచ్చి ‘ నేను తేజగారి ఫోటోను కాల్చాలని అనుకుంటున్నాను’ అని చెప్పింది. దీంత నటుడు తేజస్ గౌడ షాక్ అయ్యాడు. ‘ కెమెరా ఉన్నప్పుడు ఒకలా.. కెమెరా లేనప్పుడు ఇంకొక లాగా బిహేవ్ చేయడం చూశాను. అన్ని చోట్లా, ఎప్పుడూ ఒకేలా ఉండాలి, తను తనలా ఉండాలని నేను అనుకుంటున్నాను ‘ అని కావ్యశ్రీ తన రీజన్ చెప్పింది. దీనికి తేజస్ గౌడ స్పందిస్తూ.. ‘ఆమె అనుకున్నట్లు నేను ఎలా ఉంటాను, నేను ఎలా ఉండాలో అలాగే ఉంటాను. మీ గురించి నేనే వేరే వాళ్ల దగ్గర నెగిటివ్‌గా మాట్లాడానా’ అని తేజస్ ప్రశ్నించగా ‘ ఔను నేను చూశాను’ అని కావ్య గట్టిగా బదులిచ్చింది.

కావ్యశ్రీ లేటెస్ట్ ఫొటోస్..

దీనికి స్పందించిన తేజస్ ‘ అయినా ఎవరి అభిప్రాయాలు వారివి. వాటిని ఎవరూ మార్చలేరు. ఏ వ్యక్తయినా ఎలా ఉండాలని అనుకుంటాడో, అలాగే ఉంటాడు. మీ దృష్టిలో నేను అలా ఉంటే దానికి నేనేం చేయలేను అని’ చెబుతుండగానే తేజస్ ఫోటోను నిప్పుల్లో వేసి కాల్చేసింది కావ్యశ్రీ. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us