ఈ ఫోటో కనిపిస్తున్న నటి ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా రాణించారు. పెద్దపెద్ద హీరోల సరసన నవరసాలు పండించి అందరిచేత శబాష్ అనిపించుకున్నారు. ఆతర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మరి తనదైన సహజ నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు. ఆమె నటిస్తుంటే మన ఇంట్లో వ్యక్తే అక్కడ ఉన్నట్టు.. మన పక్కన ఉండే వ్యక్తే అక్కడ మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది… అంతలా ఆమె తన నటనతో ఆకట్టుకుంటుంది. హీరోలకు అమ్మగా నటిస్తూ.. మెప్పిస్తూ వస్తున్న ఆ సహజ నటిని గుర్తుపట్టారా..? ఆమె ఎవరో కాదు జయసుధ. 1972లో వచ్చిన పండంటి కాపురం సినిమాతో జయసుధ వెండి తెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత ఆమె సినీప్రయాణం నిర్విరామంగా సాగింది. జయసుధ దాదాపు 300లకు పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. అందులో 20 తమిళ సినిమాలు, 8 మలయాళ సినిమాలు, 3 హిందీ సినిమాలు, 1 కన్నడ సినిమా కూడా ఉన్నాయి.
ఇక రాఘవేంద్రరావు దర్శకత్వంలో సుమారు 25 సినిమాల్లో నటించారు. అలాగే దాసరి నారాయణరావు దర్శకత్వంలో 27 సినిమాల్లో నటించారు జయసుధ. అన్నింటికన్నా హైలైట్ ఏంటంటే ఒకే సంవత్సరంలో జయసుధ నటించిన సినిమాలు 25 విడుదలయ్యాయి. ఇదిలా ఉంటే గత కొంత కాలంగా జయసుధ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఆమె ప్రస్తుతం విదేశాల్లో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే సోషల్ మీడియా ద్వారా ఓ ఫోటోను పంచుకున్నారు. ఈ ఫొటోలో జయసుధ గుర్తుపట్టలేనంతగా మారిపోయాయి కనిపిస్తున్నారు. సోషల్ మీడియాలో సహజనటి ఫోటో చూసి నెటిజన్లు షాక్ అయిపోతున్నారు. సహజనటి తిరిగి సినిమాల్లో నటించాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :