ఆ హీరోతో150సినిమాల్లో నటించా.. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే : గిరిబాబు

సీనియర్ నటుడు గిరిబాబు 45 ఏళ్లకు పైగా సుదీర్ఘ సినీ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. ఈ ప్రయాణంలో ఆయన ఎలాంటి వివాదాలకూ చోటివ్వకుండా, అందరితో స్నేహపూర్వకంగా మెలుగుతూ "అజాతశత్రువు"గా పేరు పొందారు. ఇది పుట్టుకతోనే వచ్చిన లక్షణం అని, చిన్నప్పటి నుంచే తాను నాయకత్వ లక్షణాలు, స్నేహపూర్వక స్వభావాన్ని కలిగి ఉన్నానని ఆయన గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

ఆ హీరోతో150సినిమాల్లో నటించా.. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే : గిరిబాబు
Giribabu

Updated on: Mar 16, 2026 | 6:15 PM

విలక్షణ నటుడిగా తెలుగులో సినిమాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు నటుడు గిరిబాబు 45 ఏళ్లకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగుతూ, నేటి తరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఆయన తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎలాంటి వివాదాలకూ తావివ్వకుండా, అందరితో స్నేహపూర్వకంగా మెలుగుతూ అజాతశత్రువుగా పేరు తెచ్చుకున్నారు. ఇది పుట్టుకతోనే వచ్చిన లక్షణమని, చిన్నప్పటి నుంచి తాను చదువులో, ఆటల్లో ముందుంటూ, నాయకత్వ లక్షణాలతో పాటు స్నేహపూర్వక స్వభావాన్ని కలిగి ఉన్నానని గిరిబాబు గతంలో ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. చిత్ర పరిశ్రమ అనేది గుర్రాల పందెం వంటిదని, ప్రతి ఒక్కరూ ముందుకు దూసుకుపోవాలని చూస్తారని ఆయన అన్నారు. ఈ క్రమంలో చిన్న చిన్న డిస్ప్యూట్స్ రావడం సహజమని, వాటిని పెద్ద విషయాలుగా మార్చకుండా సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడమే తన విధానమని చెప్పుకొచ్చారు గిరిబాబు. ఈ పద్ధతి వల్లే తనకు సినీ పరిశ్రమలో దర్శకులు, నిర్మాతలు, సహ-నటులతో సహా అనేకమంది స్నేహితులు ఉన్నారని ఆయన పేర్కొన్నారు.

నటులు మురళీ మోహన్, మోహన్ బాబు, గుమ్మడి, సత్యనారాయణ, రంగనాథ్, శరత్ బాబు వంటి వారితో తన ఆత్మీయ స్నేహాన్ని గుర్తుచేసుకున్నారు. ఎన్.టి.రామారావుతో తనకున్న ఒక ప్రత్యేక సంఘటనను గిరిబాబు వివరించారు. ఆయన నిర్మాతగా తీసిన మొదటి చిత్రం దేవతలారా దీవించండి విజయం సాధించిన తర్వాత జానపద చిత్రాల పట్ల తనకున్న ఆసక్తితో “సింహగర్జన” కథను రాసుకున్నానని చెప్పారు. అదే సమయంలో ఎన్.టి.రామారావు “సింహబలుడు” చిత్రాన్ని చేస్తున్నారు. ఈ రెండు చిత్రాల కథలు, పేర్లు ఒకే విధంగా ఉన్నాయని, రామారావుకు వ్యతిరేకంగా కృష్ణను హీరోగా పెట్టి గిరిబాబు సినిమా తీస్తున్నారని కొందరు తప్పుడు మాటలు చెప్పారని గిరిబాబు తెలిపారు. దీనితో రామారావుకు కోపం వచ్చిందని తెలిసి, గిరిబాబు స్వయంగా ఆయన్ని కలిసి వివరణ ఇచ్చారట. రామారావు, కాంతారావులను ఆదర్శంగా తీసుకుని సినీ రంగంలోకి వచ్చామని, ఆయనపై పోటీకి దిగే ఉద్దేశం లేదని చెప్పి, తన సినిమా కథ సారాంశాన్ని వివరించారట. దీనితో రామారావు కూల్ అయ్యి, ఆశీర్వదించి పంపారని గిరిబాబు తెలిపారు.

అదేవిధంగా సూపర్ స్టార్ కృష్ణతో తనకున్న అనుబంధం గురించి మాట్లాడుతూ.. ఆయనతో 150కి పైగా చిత్రాలలో నటించానని గిరిబాబు చెప్పారు. కృష్ణ అజాతశత్రువని, చాలా ఉదాత్తమైన వ్యక్తి అని కొనియాడారు. రామారావు, కృష్ణ మధ్య వివాదాలు ఉన్నప్పటికీ, కృష్ణ వాటిని ఎప్పుడూ పట్టించుకోలేదని, ఎన్టీఆర్ ను ఎప్పుడూ పెద్దాయన అంటాడని అంతే తప్ప ఎవరినీ విమర్శించడని ఆయన తెలిపారు. తాను నటిస్తున్న చిత్రాల నిర్మాతలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు రెమ్యూనరేషన్ విషయంలో సర్దుకుపోయి, తర్వాతి చిత్రం చూసుకుందాంలే అని చెప్పే నిస్వార్థ స్వభావం కృష్ణదని గిరిబాబు వెల్లడించారు. రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు మురళీ మోహన్‌తో కలిసి గంటలపాటు పార్టీలో చేరామని అడిగారని తెలిపారు గిరిబాబు. కృష్ణ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ తమ వ్యక్తిగత బంధాలకు రాజకీయాలు అడ్డురాలేదని గిరిబాబు స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us