టాప్ స్పీడులో క‌మ్ముల‌..నెక్ట్స్ మూవీ కూడా ఫిక్స్…

|

May 23, 2020 | 2:31 PM

సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తర్వాతి సినిమా ఫైన‌ల్ అయ్యింది. ప్రజంట్ నాగ చైతన్య, సాయి పల్లవిలతో ‘లవ్ స్టోరీ’ మూవీ చేస్తున్న కమ్ముల ఆ మూవీ షూటింగ్ ఇంకో 15 రోజుల షూటింగ్ మిగిలి ఉండగానే.. తన తర్వాతి మూవీని కూడా లాక్ చేసేశాడు. అది కూడా  ‘లవ్ స్టోరీ’ మూవీ నిర్మాతతోనే కావ‌డం విశేషం. ఓ టాలీవుడ్ స్టార్ హీరో ఈ మూవీలో నటించనున్నట్లు స‌మాచారం. సినిమా సినిమాకు ఎప్పుడూ గ్యాప్ తీసుకునే శేఖర్ […]

టాప్ స్పీడులో క‌మ్ముల‌..నెక్ట్స్ మూవీ కూడా ఫిక్స్...
Follow us on

సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తర్వాతి సినిమా ఫైన‌ల్ అయ్యింది. ప్రజంట్ నాగ చైతన్య, సాయి పల్లవిలతో ‘లవ్ స్టోరీ’ మూవీ చేస్తున్న కమ్ముల ఆ మూవీ షూటింగ్ ఇంకో 15 రోజుల షూటింగ్ మిగిలి ఉండగానే.. తన తర్వాతి మూవీని కూడా లాక్ చేసేశాడు. అది కూడా  ‘లవ్ స్టోరీ’ మూవీ నిర్మాతతోనే కావ‌డం విశేషం. ఓ టాలీవుడ్ స్టార్ హీరో ఈ మూవీలో నటించనున్నట్లు స‌మాచారం. సినిమా సినిమాకు ఎప్పుడూ గ్యాప్ తీసుకునే శేఖర్ కమ్ముల ఈసారి లాక్ డౌన్ బ్రేక్ లో తన తర్వాతి సినిమాకు సంబంధించిన వర్క్ కూడా చ‌కాచ‌కా కానిచ్చేస్తున్నారు. .

‘లవ్ స్టోరీ’ మూవీ కంటెంట్ మీదున్న నమ్మకం, శేఖర్ వ‌ర్కింగ్ స్టైల్ నచ్చ‌డంతో.. ప్రొడ్యూసర్ నారాయణ్ దాస్ నారంగ్ తమ తరవాత సినిమా కూడా శేఖర్ ను చేయమని కోరగానే.. ఆయన వెంటనే దానికి ఓకే చెప్పాడు.  ‘లవ్ స్టోరీ’  సినిమా రిలీజ్ అవ్వగానే ఈ మూవీ పట్టాలెక్కనుంది. . న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాలు త్వ‌ర‌లో వెల్లడించ‌నుంది నిర్మాణ సంస్థ. ఏది ఏమైనా లాక్ డౌన్ స‌మ‌యాన్ని ఇంత చ‌క్క‌గా వినియోగించుకున్న డైరెక్ట‌ర్ శేఖర్ క‌మ్ముల‌నే అని చెప్పాలి.