Love Story : లవ్ స్టోరీ మూవీ రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్న మేకర్స్.. ప్రేక్షకుల ముందుకు వచ్చేది ఎప్పుడంటే..?

టాలీవుడ్ లో సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల. ఆయన తెరకెక్కించిన సినిమాలన్నీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Love Story : లవ్ స్టోరీ మూవీ రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్న మేకర్స్.. ప్రేక్షకుల ముందుకు వచ్చేది ఎప్పుడంటే..?
Love Story

Updated on: Jun 09, 2021 | 4:09 PM

Love Story :

టాలీవుడ్ లో సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల. ఆయన తెరకెక్కించిన సినిమాలన్నీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ను. శేఖర్ కమ్ముల చేసే సినిమాలు సహజత్వానికి చాలా దగ్గరగా ఉంటాయి. ఆ సినిమాలోని పాత్రలు మన చుట్టూ పక్కల ఉండేవిగానే ఉంటాయి. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ డైరెక్టర్ అందమైన ప్రేమ కథను తెరకెక్కిస్తున్నారు. అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య హీరోగా ఫిదా సినిమాతో ఎంట్రీ ఇచ్చి దూసుకుపోతున్న సాయిపల్లవి హీరోయిన్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాకు లవ్ స్టోరీ అనే సింపుల్ టైటిల్ ను ఫిక్స్ చేశారు శేఖర్. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పాటలు, పోస్టర్లు టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. అయితే అన్ని సినిమాల మాదిరిగానే కరోనా కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది. నిజానికి ఈ సినిమా ఏప్రిల్ లో విడుదల కావాల్సింది కానీ అది కుదర్లేదు దాంతో మే కు షిఫ్ట్ అయ్యారు మేకర్స్. కానీ కరోనా మహమ్మారి ప్రభావం తగ్గక పోవడంతో మీ లో కూడా రిలీజ్ కాలేదు ఈ సినిమా.

ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గుతున్నట్టుగా కనిపిస్తూ ఉండటంతో, ఆగస్టులో విడుదల చేయాలనే నిర్ణయానికి మేకర్స్ వచ్చినట్టుగా తెలుస్తోంది. రావు రమేశ్ .. దేవయాని .. ఈశ్వరీరావు ముఖ్యమైన పాత్రలను పోషించారు. త్వరలోనే లవ్ స్టోరీ విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Ram Gopal Varma: అమితాబ్ తో ఆర్జీవీ సినిమా ఎలా ఉండబోతుంది..? బిగ్ బి కోసం వర్మ భారీ ప్లాన్ వేస్తున్నారా..?

Samantha Akkineni : ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ కోసం సమంత, మనోజ్ బాజ్ పేయ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

Janhvi Kushi: శ్రీదేవి కూతురు టాలీవుడ్ సినిమాపై బాలీవుడ్ లో చర్చ.. త్వరలోనే తెలుగు తెరపై కనిపించనుందంటూ వార్తలు ..

The Family Man 2: ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ పై ముదురుతున్న వివాదం.. సిరీస్ ను బ్యాన్ చేయాలని డిమాండ్ చేసిన సీనియర్ డైరెక్టర్

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us