Samantha: నాపై నీకు ఇంత అధికారం ఎలా వచ్చింది.. ఆసక్తికర పోస్ట్ చేసిన సమంత..

|

Oct 18, 2021 | 10:06 AM

సమంత.. నిత్యం నెట్టింట్లో వినిపిస్తున్న పేరు.. నాగచైతన్యతో విడిపోయినట్లుగా ప్రకటించిన అనంతరం.. ఒక్కసారిగా సామ్ పేరు

Samantha: నాపై నీకు ఇంత అధికారం ఎలా వచ్చింది.. ఆసక్తికర పోస్ట్ చేసిన సమంత..
Samantha
Follow us on

సమంత.. నిత్యం నెట్టింట్లో వినిపిస్తున్న పేరు.. నాగచైతన్యతో విడిపోయినట్లుగా ప్రకటించిన అనంతరం.. ఒక్కసారిగా సామ్ పేరు సోషల్ మీడియాలో సంచలనంగా మారిపోయింది. వీరిద్దరూ విడిపోవడానికి గల కారణాలు తెలుసుకోవడానికి నెటిజన్స్ గూగుల్‏ను జల్లెడ పట్టారు.. ఇక సామ్…. చైతూ అభిమానులు మాత్రం షాక్‏లో ఉండిపోయారు.. సామ్.. చైతూ విడాకులు తీసుకోవద్దు విజ్ఞప్తి చేశారు.. ఇక మరోవైపు సామ్ ప్రవర్తనా.. వ్యవహర తీరు వల్లే చైతన్య విడాకులు ఇచ్చారని.. సమంత కుటుంబం కంటే సినిమాలకే ప్రాధాన్యత ఇచ్చిందని… ఇలా ఇష్టానుసారంగా కామెంట్స్ చేశారు.. దీంతో సమంత… తన మనసులోని బాధను.. తన పరిస్థితిని తన ఇన్‏స్టా ఖాతాలో షేర్ చేసుకుంది.. ఇక విడాకుల ప్రకటన అనంతరం.. సామ్, చైతూ ఇద్దరూ ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు.

ప్రస్తుతం ఇద్దరూ విడిపోయి ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు.. కెరీర్ పై దృష్టి పెట్టి.. వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.. ఈ క్రమంలోనే గత కొన్ని రోజులుగా సమంత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వస్తుంది.. తాజాగా ఈరోజు ఉదయం సామ్.. తన ఇన్‏స్టా స్టోరీలో ఆసక్తికరమై ట్వీట్ చేసింది. “స్నేహ దేషు.. నా మీద నీకు ఇంత ఆధీనం ఎలా వచ్చింది. నీవు ఇక్కడ లేకపోయినా కూడా భయం వేస్తోంది. ఎవరు చెప్పినా కూడా నేను 30 కిలోల డంబెల్ వైపు కన్నెత్తి చూడను. కానీ నీ వల్ల చేయాల్సి వస్తుంది. ఆ డంబెల్ వైపు చూడండి. నాలో సగం బరువు ఉంటుంది” అంటూ తన డంబెల్ ఎత్తుతూ వర్కౌట్ చేస్తు్న్న విడీయోను షేర్ చేసింది. స్నేహ దేషు.. సమంత జిమ్ ట్రైనర్.. ఇదిలా ఉంటే.. సమంత నటించిన శాకుంతలం సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

పోస్ట్..

పోస్ట్..

Also Read: Kasturi Sankar: బిగ్‏బాస్‏లో కనిపిస్తున్నవన్ని నిజాలు కావు.. గృహలక్షి నటి షాకింగ్ కామెంట్స్…

Nagarjuna: రీమేక్ చిత్రాలపై మనసు పడుతున్న టాలీవుడ్ స్టార్ హీరోస్.. మరో అడుగు ముందుకేసిన నాగార్జున..