Samantha Special Song: తగ్గేదే లే.. నెట్టింట్లో సమంత స్పెషల్ సాంగ్ హవా.. రికార్డ్స్ మాములుగా లేవుగా..

|

Dec 16, 2021 | 12:37 PM

ఇప్పుడు ఎక్కడా చూసిన పుష్ప మేనియా కనిపిస్తోంది. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న పుష్ప సినిమా ఎట్టకేలకు రేపు ప్రేక్షకుల

Samantha Special Song: తగ్గేదే లే.. నెట్టింట్లో సమంత స్పెషల్ సాంగ్ హవా.. రికార్డ్స్ మాములుగా లేవుగా..
Samantha Item Song
Follow us on

ఇప్పుడు ఎక్కడా చూసిన పుష్ప మేనియా కనిపిస్తోంది. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న పుష్ప సినిమా ఎట్టకేలకు రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. స్మగ్లర్ పుష్పరాజ్ పాత్రలో పూర్తి ఢీగ్లామర్ లుక్కులో కనిపించనున్న బన్నీని వెండితెరపై చూసేందుకు అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్ సోషల్ మీడియాలో రికార్డ్స్ సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా సమంత నటించిన స్పెషల్ సాంగ్ యూట్యూబ్‏ను షేక్ చేస్తోంది. ఊ అంటావా మావా.. ఊహు అంటావా అంటూ మత్తు వాయిస్‏తో సాగే ఈ పాట ఇప్పుడు యూట్యూబ్‏లో దుమ్మురేపుతుంది. చంద్రబోస్ లిరిక్స్.. సమంత స్టెప్పులు.. ఇంద్రావతి నిశా వాయిస్‏కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నాయి. ముఖ్యంగా లిరిక్స్ సాంగ్ వీడియోలో సింగర్ ఇంద్రావతి ఇచ్చిన ఎక్స్‏ప్రెషన్స్ ఈ పాటను నెక్ట్స్ లెవల్‏కు తీసుకెళ్లింది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ పాట కేవలం తెలుగులోనే 4.5 మిలియన్ వ్యూస్ అందుకుంది. ఇక అన్ని భాషల్లో కలిపి 5 రోజులలో ఈ పాట 10 లక్షల లైక్స్ అందుకుని రికార్డ్స్ సృష్టిస్తోంది. ఇక థియేటర్లలో ఈ సాంగ్ మరింత సందడి చేయనుంది. అలాగే సమంత పర్ఫామెన్స్‏కు బొమ్మ దద్దరిల్లడం ఖాయంగా కనిపిస్తుంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇందులో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలక పాత్రలో నటిస్తున్నారు.

ట్వీట్..

Also Read: Brahmastra: ‘సామాన్యుల ఊహకు అందనిది, ఈ విశ్వంలో ఏదో జరుగుతోంది’.. ఆసక్తిని పెంచేసిన బ్రహ్మస్త్ర మోషన్ పోస్టర్..

RRR Trailer: రికార్డుల వేటలో దూసుకుపోతున్న ఆర్‌.ఆర్‌.ఆర్‌ ట్రైలర్‌.. ఆ ఘనత సాధించిన తొలి ఇండియన్‌ సినిమా ఇదే..

Rashmika Mandanna: రష్మికను దారుణంగా ట్రోల్ చేసిన నెటిజన్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన కన్నడ బ్యూటీ..